Viral Video: సాధారణంగా ఆడవాళ్లకు షాపింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం ఈ క్రమంలోనే భార్యలతో కలిసి భర్తలు షాపింగ్ వెళ్లాలంటే ఏవో కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటారు.గంటలతరబడి షాపింగ్ చేయడమే కాకుండా ఎన్నో రకాల వస్తువులను కొనుగోలు చేస్తూ పెద్దఎత్తున డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు.ఈ విధంగా భార్యల షాపింగ్ గురించి భర్తలు ఎన్నో రకాల జోక్స్ వేస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాము.అయితే కొన్నిసార్లు మహిళలు కూడా తామేం తక్కువ కాదంటూ అనవసరంగా ఏవీ కొనుగోలు చెయ్యము కదా అంటూ భర్త పై రివర్స్ అటాక్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా రాబర్ట్ అనే వ్యక్తి తన భార్య ఏ రేంజ్ లో షాపింగ్ చేస్తుందో అందరికీ చూపించాలని భావించారు. ఈ క్రమంలోనే తను ఇల్లు విడిచి వెళ్లి పోతే తన భార్య షాపింగ్ ఏ విధంగా ఉంటుందో వీడియో ద్వారా అందరికీ తెలియజేశారు. ముఖ్యంగా తన భార్య కొనుగోలు చేసిన చెప్పులను చూపించారు. తన భార్య ఇంటి నుంచి వెళ్ళగానే తను కొనుగోలు చేసిన చెప్పులను వరుసగా పేరుస్తూ వెళ్లారు.

Viral Video: ఈ విధంగా ఇల్లు మొత్తం తన భార్య చెప్పులతో నిండిపోయింది.
ఇలా వరుసగా పేర్చిన ఆ భర్త అనంతరం తన భార్యకు ఎన్ని జతల చెప్పులు ఉన్నాయో కౌంట్ చేస్తూ వెళ్లాడు. ఇలా కౌంట్ చేస్తూ వెళ్లగా తన భార్యకు ఏకంగా వంద జతల వివిధ రకాల చెప్పులు ఉండటంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయ్యింది. ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు ఈ వీడియో చూసి ఇదేం పిచ్చి రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి వంద జతల చెప్పులు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.