Viral Video: ఈ మధ్యకాలంలో యువత చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ప్రేమ అన్న మాయలో పడి ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికి మొన్న కేరళలో ఒక జంట బైక్ పై రొమాన్స్ చేస్తూ ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చట్ట ప్రకారంగా వారిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే తాజాగా అలాంటి గడ్డమీద ఒకటి లక్నోలో చోటు చేసుకుంది. ఒక యువతి అయితే ప్రియుడు బైక్ నడుపుతుండగా చుట్టూ జనాలు చూస్తున్నా కూడా రెచ్చిపోయి ట్రాఫిక్ లోనే ప్రియుడికి ముద్దుల వర్షం కురిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
లక్నోలో నిత్యం రద్దీగా ఉండే హజ్రత్ గంజ్ ప్రాంతంలో కదులుతున్న స్కూటీపై ఒక జంట రెచ్చిపోయారు. ప్రియుడు స్కూటీ తోలుతుండగా ప్రియురాలు అతనికి ముందు భాగంలో కూర్చుని అతనికి ముద్దుల మీద ముద్దులు పెడుతూ హెయిర్ స్టైల్ సరి చేస్తూ రెచ్చిపోయింది. అయితే చుట్టూ వాహనాలు వెళుతున్న కూడా ట్రాఫిక్ లో ఉన్నా ఆ యువతి ఏ మాత్రం భయపడకుండా ఇంత రెచ్చిపోయి ప్రవర్తించింది. ఇక ఆ ఘటన చూసిన స్థానికులు అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను ఈ ఫోన్లను బంధించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే ఆ వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో అవి కాస్త పోలీసుల కంటపడ్డాయి.
Viral Video: ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్….
దాంతో వెంటనే సీరియస్ అయిన లక్నో సెంట్రల్ జోన్లోని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అపర్ణ రజత్ కౌశిక్, ఆ వీడియో లక్నో కి చెందినదని పోలీసులు ధ్రువీకరించారు. అంతే కాకుండా స్కూటీ పై ఉన్న దంపతుల కోసం పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి వెతుకుతున్నట్లు తెలిపారు. అశ్లీలత ప్రచారం చేసిన ఆ దంపతులపై మోటారు వాహనాల చట్టం కింద చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ జంట ప్రవర్తన మర్యాద అలాగే సామాజిక ప్రవర్తన సరిహద్దులను గమనించినందుకుగాను వారిపై చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.