Viral Video: ఒకప్పుడు పెళ్లి అంటే ఎంతో సాంప్రదాయబద్ధంగా మంగళవాయిద్యాలు నడుమ, ఆకాశమంత పందిరి వేసి ఘనంగా పెళ్లి చేసేవారు. అయితే రోజులు మారుతూ ఉన్న కొద్దీ పెళ్లికి వచ్చే వారికి వినోదం అందించడం కోసం పెళ్లిలో సంగీత్ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇలా పెళ్లిళ్లలో కళ్యాణమండపం లోపల ఆర్కెస్ట్రా పెట్టించగా పెళ్లికి వచ్చిన అతిథులు ఎంతో వినోదం పొందేవారు. రానురాను పెళ్ళిళ్ళలో బంధువులు కూడా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు.
అయితే ఒకప్పుడు కేవలం వధూవరుల కుటుంబ సభ్యులు మాత్రమే డ్యాన్సు చేయగా వధువు మాత్రం ఎంతో సిగ్గుపడుతూ పెళ్లి పీటలపై కూర్చునేది. కానీ ప్రస్తుత కాలంలో పెళ్లికూతురు ఏమాత్రం సిగ్గుపడకుండా ఏకంగా డీజే పెట్టించి డాన్సులు వేయడం ట్రెండ్ అయిపోయింది. వరుడు కన్నా ముందుగా వధువు డాన్స్ చేస్తూ అందరినీ సందడి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వధూవరులు డాన్స్ చేయడం ట్రెండ్ అవుతోంది.ఈ క్రమంలోనే ఇలాంటి డాన్స్ వీడియోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఎన్నో చక్కర్లు కొడుతున్నాయి.

Viral Video: అదిరిపోయిన మాస్ స్టెప్పులు..
ఇకపోతే ఇదివరకు పెళ్లిళ్లలో కొన్ని పాటలకు మాత్రమే డాన్సులు చేస్తూ సందడి చేసే వారు.కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో మాత్రం ఏకంగా సమంత నటించిన ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ రెచ్చిపోయారు. అయితే ఈ డాన్స్ చేసింది ఎవరో కాదండోయ్ స్వయానా వధువు. ఐటమ్ సాంగ్ తో దుమ్ము లేపిన ఈమె తను డాన్స్ చేయడమే కాకుండా చివరికి వరుడు చేత కూడా ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేయించింది. ఇలా వధూవరులు ఇద్దరూ కలిసి ఐటమ్ సాంగ్ కి స్టెప్పులు వేయడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.