Virupaksha Movie: కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ సంయుక్త మీనన్ జంటగా నటించిన విరూపాక్ష సినిమా ఇటీవల విడుదలై మంచి హిట్ అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 21వ తేదీన భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు చేరువయ్యింది. ఈ క్రమంలో సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ తాజాగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన విరూపాక్ష సక్సెస్ మీట్ లో బుల్లితెర నటుడు రవికృష్ణ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే రవికృష్ణ ఇలా ఎమోషనల్ అవ్వటానికి కూడా కారణం లేకపోలేదు.
ఎన్నో సీరియల్స్ లో నటించి బుల్లితెర నటుడిగా రవికృష్ణ గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో పలు టీవీ షోలలో కూడా పాల్గొంటూ సందడి చేశాడు. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇలా సీరియల్స్ ద్వారా బుల్లితెర నటుడిగా గుర్తింపు పొందిన రవికృష్ణకి విరూపాక్ష సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో రవి కృష్ణ పాత్ర తక్కువ సమయం ఉన్నప్పటికీ ఆ పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇలా తాను నటించిన మొదటి సినిమాలోని తన పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ తో రవికృష్ణ ఎమోషనల్ అయ్యాడు.
Virupaksha Movie: కన్నీళ్లు పెట్టుకున్న రవిక్రిష్ణ…
విరూపాక్ష సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న రవికృష్ణ సినిమాని సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేసాడు. ప్రేక్షకుల ప్రేమాభిమానాలు వారిపై చూపించినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపాడు. వారు ఊహించినట్లుగానే ప్రేక్షకులు సినిమాని ఆదరించి సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు కార్తీక్ దండు కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.