Virupaksha: పిల్లా నువ్వు లేని జీవితం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్. మొదటి సినిమాతోనే సాయి ధరమ్ హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ నటించిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, విన్నర్, సుప్రీం, జవాన్ వంటి సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇక రిపబ్లిక్ సినిమా విడుదలకు ముందు సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడిన తర్వాత విరూపాక్ష సినిమా షూటింగ్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 21వ తేదీ పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమా యూనిట్ ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశంలో సినిమా గురించి సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ సమావేశంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ..” ప్రేక్షకుల అభిమానం వల్లే నేను ఈరోజు ఈ వేదికపై నిలబడి ఉన్నాను. సుకుమార్ గారు నాకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు ప్రేమ కథ అనుకొని సినిమా చేసేద్దాంలే అనుకున్నాను. కానీ డైరక్టర్ కార్తిక్ వచ్చి ఇది థ్రిల్లర్ మూవీ అనగానే షాక్ అయ్యాను అంటూ సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు. కథ వినగానే ఈ సినిమా పక్క హిట్ అవుతుందని వెంటనే సినిమాకి ఒప్పుకున్నానని తేజ్ వెల్లడించారు.
Virupaksha: కరోనా వల్ల ఆలస్యమైంది…
సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి కోరుకున్న తర్వాత తీసిన మొదటి సినిమా ఇది. ఈ సినిమా గురించి సాయి ధరంతేజ్ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక ఈ సమావేశంలో డైరెక్టర్ కార్తీక్ దండు మాట్లాడుతూ.. 2018లో సుకుమార్ గారికి ఈ సినిమా స్టోరీ చెప్పాను. కానీ ఆ తర్వాత కరోనా, లాక్ డౌన్, సాయి ధరంతేజ్ ప్రమాదానికి గురవటం వల్ల ఈ సినిమా ఇంత ఆలస్యం అయ్యింది. ఏప్రిల్ 21వ తేదీ ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అంటూ కార్తీక్ వెల్లడించాడు.