Vishwak Sen: తెలుగు సినీ లవర్ కి విశ్వక్ సేన్ పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్న విశ్వక్. ఆ తర్వాత వచ్చిన ఫలక్ నుమా దాస్ తో యువతులను సైతం ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు.
ఇక తన ప్రత్యేక మేనరిజంతో ఆ సినిమాతోనే ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ఇక ఈ మధ్య కాలంలో వచ్చిన పాగల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక విశ్వక్ తన సినిమాలకు తానే స్వయంగా స్టోరీ రూపంలో ప్రాణం పోసుకుంటాడు. మొత్తానికి విశ్వక్ సేన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతున్నాడు.
ఇదిలా ఉంటే విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా మనకు తెలుసు. ఇక ఈ మూవీ ప్రమోషన్ ల నేపథ్యంలో ఇతడు కొన్ని ప్రాంక్ వీడియో లు చేసాడు. దీని గురించి ఈరోజు టీవీ9 లో భారీ ఎత్తున డిబేట్ జరిగింది. టీవీ 9 కి వచ్చిన హీరో విశ్వక్ సేన్ యాంకర్ నాగవల్లి తో డిబేట్ వేసుకున్నాడు.

Vishwak Sen: యాంకర్ నాగవల్లి ని విశ్వక్ సేన్ ఫక్ ఆఫ్ అనడానికి కారణం ఇదే!
ఇక అలా డిబేట్ కొన సాగుతున్న క్రమంలో యాంకర్ నాగవల్లి విశ్వక్ సేన్ ను డిప్రెసిడ్ పర్సన్ అని అన్నది. దాంతో విశ్వక్ ఆ యాంకర్ పై ఒక రేంజ్ లో విరుచుకు పడ్డాడు. ఇక చివర్లో విశ్వక్ తనని ఫక్ అఫ్ అని కూడా అన్నాడు. ఆ మాటతో అసహనం వ్యక్తం చేసిన యాంకర్ నాగవల్లి స్టూడియో నుంచి బయటకు వెళ్ళిపో అని అన్నది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ గా మారింది. మీరు కూడా వీడియోపై ఒక లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=56egbf1GyFY