Vishwak sen: ఈ నగరానికి ఏమైంది, పాగల్, హిట్ వంటి సినిమాల ద్వారా నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఈ క్రమంలోని ఈయన తాజాగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. విశ్వక్ దర్శకత్వంలోనే, ఆయనే నిర్మాతగా నివేదా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం దాస్ కా ధమ్కీ. ఈ సినిమా ఈనెల 22వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా శిల్పకళ వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.

ఇక ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సినిమాకు ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ గారిని ఆహ్వానించినప్పుడు ఆయన ఇంట్లో ఒక మరణం సంభవించింది. ఇలాంటి సమయంలో ఆయన వస్తారా రారా అని సంకోచంతో తనని ఆహ్వానించాను. అయితే ఆయన ఈ సినిమా ఈవెంట్ కువస్తానని చెప్పడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.

Vishwak sen:  ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది….

ఈ కార్యక్రమంలో భాగంగా విశ్వక్ మాట్లాడుతూ ఎన్టీఆర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్కరిని తప్పకుండా ఆకట్టుకుంటుందని విశ్వక్ తెలిపారు. ఇకపోతే ఈ సినిమా కోసం తన సర్వస్వం మొత్తం దార పోసి పనిచేశానని అయితే నేను పడిపోతే, నాశనం అయిపోతే చూడాలని చాలా మంది ఎదురుచూస్తున్నారని ఈయన తెలిపారు.ఇక ఈ సినిమా ఈవెంట్ కు ఎన్టీఆర్ గారు ముఖ్య అతిథిగా రావడంతో ఆయన అభిమానుల బ్లెస్సింగ్ కారణంగా నా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకం తనకు ఉంది అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. మరి ఈ సినిమా నటుడు విశ్వక్ కి ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.

Akashavani

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...