Vishwak Sen: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో విశ్వక్ సేన్ పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్న విశ్వక్ ఆ తర్వాత వచ్చిన ఫలక్ నుమా దాస్ తో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఫిదా చేసాడు. ఇక తన ప్రత్యేక యాటిట్యూడ్ తో యువతులను సైతం బాగా ఆకట్టుకున్నాడు.
ఆ మధ్య పాగల్ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇతడు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటాడు. తన మూవీ అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటాడు. ఇదిలా ఉంటే గత మూడు రోజులుగా విశ్వక్ సేన్ సోషల్ మీడియా నోట్లో నాను తున్న సంగతి మనకు తెలిసిందే.
అశోకవనంలో అర్జున్ కళ్యాణం సినిమా కోసం చేసిన ప్రమోషన్ లో భాగంగా విశ్వక్ సేన్ చేసిన ఫ్రాంక్ వీడియోలు ఇప్పుడు తనకు తలనొప్పిగా మారాయి. కాగా ఇటీవల ఖమ్మంలో జరిగిన మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆ క్రమంలో స్టూడియో లో తను ఎదుర్కొన్న ఘటనను ఉద్దేశించి తనలోని తనకున్న ఉక్రోచాన్ని బయటపెట్టాడు.
Vishwak Sen: విశ్వక్ సేన్ కు అమ్మాయిల విషయంలో వేసిన నింద ఇదే!
అంతేకాకుండా.. అమ్మా నీకు ఒకటి చెప్తున్నా నీ కొడుక్కి ఏమీ కాదు ఏం పీకలేరు.. నేను అమ్మాయిలకు రెస్పక్ట్ ఇచ్చేవాడిని కాదు అంటున్నారు. అదే నిజమైతే ఆ రోజు స్టూడియో లో నుంచి అలా తిరిగి వచ్చే వాడిని కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక నీ కొడుకు కి నువ్వు నేర్పిన సంస్కారం ఏంటో అందరికి తెలుసు అని తెలిపాడు.
ఆ తర్వాత తన అభిమానుల రూపంలో తన బలం గురించి మాట్లాడుతూ విశ్వక్ సేన్ బాగా ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం విశ్వక్ చెప్పిన ఆ ఎమోషనల్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.