Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో,మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేవలం పది రోజులలోనే 200 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా భారీ ధరలకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది.
వాల్తేరు వీరయ్య సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ
ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేశారు. ఇకపోతే ఈ సినిమా థియేటర్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో త్వరలోనే ఈ సినిమాని డిజిటల్ స్ట్రీమింగ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వాల్తేరు వీరయ్య సినిమాని నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం అయితే త్వరలోనే ఈ విషయం గురించి అధికారకంగా ప్రకటన ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Waltair Veerayya: 20 రోజులకు 200 కోట్లు కలెక్షన్లు రాబట్టిన వీరయ్య…
మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సమయంలో ఈయన రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలకు గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాలలో పెద్దగా సక్సెస్ సాధించలేక పోవడంతో తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి పలు సినిమాలలో నటించినప్పటికీ ఈ సినిమాలన్నీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఏ సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుందని చెప్పాలి.