Nara Rohit : నారా రోహిత్.. పరిచయం అక్కర్లేని పేరు. ఒక రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన నారా రోహిత్.. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న హీరో నారా రోహిత్. చాలా డిఫరెంట్ జానర్ లో సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు నారా రోహిత్. చంద్రబాబు తమ్ముడి కొడుకు ఆయన. బాణం సినిమాతోనే అందరి అటెన్షన్ ను గ్రాబ్ చేశాడు నారా రోహిత్.
ఆ తర్వాత పరుశురాం దర్శకత్వంలో వచ్చిన సోలో సినిమాతో తన సత్తా ఏంటో చూపించాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ముద్ర వేయించుకున్నాడు నారా రోహిత్. ఆ తర్వాత నారా రోహిత్ కు చాలా సినిమాలు వెతుక్కుంటూ వచ్చాయి. సోలో తర్వాత చాలా సినిమాల్లో నటించినా ఆ సినిమాలు అంతగా ఆడలేదు. వెరైటీ సినిమాలు తీయడంలో నారా రోహిత్ దిట్ట కావడంతో అదే జోనర్ లో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తీసినా కూడా ఆయన నటించిన సినిమాలు అంతగా హిట్ కాలేదు.
Nara Rohit : టీడీపీలో చేరాడా?
తను నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టినట్టు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి టాలీవుడ్ లో రోహిత్ కనిపించడం లేదు. దీంతో ఆయన సినిమాలకు ఇక బైబై చెప్పి.. రాజకీయాల్లో చేరినట్టు తెలుస్తోంది. 2024 లో ఎలాగూ ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో చంద్రబాబు పార్టీ టీడీపీ తరుపున నారా రోహిత్ ప్రచారం చేస్తారు అనే వార్తలు ప్రస్తుతం గుప్పుమంటున్నాయి. ఇది వరకు కూడా కొన్ని సార్లు టీడీపీ తరుపున ప్రచారం చేశారు. దీంతో ఈసారి ఎన్నికల నాటికి టీడీపీలో చేరి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. సినీ కెరీర్ కు గుడ్ బై చెప్పి కొత్తగా రాజకీయ రంగానికి ఎంట్రీ ఇచ్చేందుకు నారా రోహిత్ పక్కా ప్రణాళిక రచించుకుంటున్నట్టు తెలుస్తోంది.