what sandeep reddy vanga did before arjun reddy movie

Sandeep Reddy Vanga : సందీప్ రెడ్డి వంగ అనగానే మనకు గుర్తొచ్చే పేరు అర్జున్ రెడ్డి సినిమా. అవును.. ఆ సినిమాతోనే ఆయనకు చాలా గుర్తింపు వచ్చింది. నిజానికి పెళ్లి చూపులు సినిమాతోనే తనేంటో నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఆయన చేసిన మరో సినిమా అర్జున్ రెడ్డి కూడా సూపర్ డూపర్ అయింది. ఈ రెండు సినిమాల వరుస విజయంతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిపోయాడు.

విజయ్ దేవరకొండను హీరోగా పెట్టి అర్జున్ రెడ్డి సినిమా తీసి సందీప్ రెడ్డి వంగా ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యాడు. తన తొలి సినిమాకే స్టార్ డైరెక్టర్ అయిన వ్యక్తి ఒక్క సందీప్ రెడ్డి మాత్రమే. ప్రస్తుతం సందీప్ రెడ్డి పాన్ ఇండియా సినిమాల మీద పడ్డాడు. ఫుల్ టు ఫుల్ బిజీ అయిపోయాడు.

Sandeep Reddy Vanga : ఎంబీబీఎస్ చదివి డాక్టర్ గా ప్రాక్టీస్ చేయకుండా డైరెక్టర్ అయ్యాడు

నిజానికి సందీప్ రెడ్డి వంగా ఒక డాక్టర్. ఎంబీబీఎస్ చేశాడు. డాక్టర్ గా ప్రాక్టీస్ చేయకుండా.. సినిమాల మీద ఉన్న ఫ్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చేశారు. అలా.. ఫిలిం స్కూల్ లో డైరెక్షన్ ట్రెయినింగ్ తీసుకొని ఆ తర్వాత నాగార్జున కేడీ మూవీ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో పని చేశాడు. కానీ.. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే సినిమాలో రైటింగ్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేశాడు సందీప్ రెడ్డి.

ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. శర్వానంద్, నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా వచ్చింది ఆ సినిమా. ఆ తర్వాత తన దగ్గర ఉన్న కథను పట్టుకొని చాలామంది హీరోల దగ్గరికి వెళ్లాడు కానీ.. ఏ హీరో కూడా ఆ స్టోరీని మెచ్చలేదు. చివరకు ఆ కథ విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లింది. అప్పుడే అర్జున్ రెడ్డి సినిమాను విజయ్ తో తీసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు సందీప్ రెడ్డి వంగ.