who missed kotha bangau lokam movie hero character
who missed kotha bangau lokam movie hero character

Kotha Bangaru Lokam : కొత్త బంగారులోకం సినిమా గుర్తుందా? 90 స్ కిడ్స్ కు ఈ సినిమా బాగా గుర్తుండి ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. ఈసినిమాలో వరుణ్ సందేశ్ హీరోగా, శ్వేతా బసు ప్రసాద్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్. దిల్ రాజు నిర్మాత. హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ సక్సెస్ కొట్టిన వరుణ్ సందేశ్ కు ఈ సినిమా కూడా మంచి పేరే తీసుకొచ్చింది. కానీ.. ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు.. వరుణ్ కంటే ముందు మరో హీరోను అనుకున్నారట.

నిజానికి ఈ సినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఈ సినిమాకు యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఉండే, సాధారణంగా ఉండే కుర్రాడి లాంటి హీరో కావాలి. ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా అటువంటిది. అందుకే ఈ సినిమా వరుణ్ దగ్గరికి రావడానికంటే ముందు కూడా నాగ చైతన్య దగ్గరికి వెళ్లిందట. దిల్ రాజు, శ్రీకాంత్ ఇద్దరూ ఈ సినిమాకు నాగ చైతన్య సెట్ అవుతాడని అనుకొని.. నాగార్జునను కలిసి స్టోరీ చెప్పారట. అయితే.. అప్పటికీ ఇంకా నాగ చైతన్య సినిమాల్లోకి రాలేదు. ట్రెయినింగ్ లో ఉన్నాడు. తన తొలి మూవీ జోష్ కూడా రాలేదు. దీంతో తొలి సినిమానే ఇలా లవ్ స్టోరీ వద్దని.. నాగ చైతన్యను మంచి మాస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తా అని చెప్పాడట నాగార్జున.

Kotha Bangaru Lokam : హ్యాపీ డేస్ లో వరుణ్ ను చూసి ఈ సినిమాకు ఫిక్స్ చేసిన దిల్ రాజు

అదే సమయంలో శేఖర్ కమ్ముల మూవీ హ్యాపీ డేస్ రిలీజ్ అవడంతో ఆ సినిమాలో వరుణ్ ను చూసి కొత్త బంగారులోకం సినిమాకు వరుణ్ అయితే కరెక్ట్ గా సెట్ అవుతాడని దిల్ రాజు, శ్రీకాంత్ అడ్డాల భావించారట. దీంతో వెంటనే వరుణ్ కు కథ చెప్పడంతో అతడు కూడా ఓకే చెప్పడంతో చకచకా సినిమా షూటింగ్ కూడా పూర్తయి విడుదలయింది. అప్పట్లో ఆ సినిమా పెద్ద సంచలనమే సృష్టించింది. ప్యూర్ అండ్ క్లాస్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ సినిమా నాగ చైతన్య చేసి ఉంటే.. నాగ చైతన్య రేంజ్ మరోలా ఉండేదని ఇప్పుడు అక్కినేని అభిమానులు బాధపడుతున్నారు. ఏది ఏమైనా.. నాగ చైతన్య కూడా ఏమాయ చేశావే లాంటి ప్యూర్ లవ్ స్టోరీ సినిమాతో క్లాస్ హీరో అయిపోయాడు.