Bigg Boss 7: బిగ్ బాస్ కార్యక్రమం మరొక రెండు రోజులలో 11వ వారం కూడా పూర్తి చేసుకోబోతుంది. ఇక ఈవారం నామినేషన్స్ లో ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. పల్లవి ప్రశాంత్ శివాజీ మినహా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న సంగతి మనకు తెలిసింది. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయం గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది అయితే ఈసారి మాత్రం ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ బయటకు రాబోతున్నారని తెలుస్తుంది.
నామినేషన్ లో ఉన్నటువంటి ఎనిమిది మందిలో అమర్, అర్జున్, గౌతమ్, యావర్ ఈ నలుగురు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే వీరికి ఓట్ల పరంగా కూడా ఏమాత్రం డోకా లేదు కనుక ఈ నలుగురు ఎలిమినేట్ అయ్యే అవకాశం లేదు ఇక శోభా శెట్టి ప్రియాంక గురించి మాట్లాడాల్సి వస్తే వీరిని బిగ్ బాస్ బయటకు పంపించకుండా ప్రతిసారి సేవ్ చేస్తూ వస్తున్నారు కనుక ఈ వారం కూడా వీరిద్దరూ సేఫ్ అయ్యారని తెలుస్తుంది. ఇక మిగిలినది అశ్విని రతిక. ఇద్దరు కూడా ఓటింగ్ పరంగా కూడా డేంజర్ పొజిషన్లో ఉన్నారని తెలుస్తుంది.
అశ్విని బయటకు రానుందా…
ఓట్లు పరంగా వీరిద్దరూ డేంజర్ పొజిషన్ లో ఉండడంతో ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అశ్విని లేదా రతిక ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయానికి వస్తే ఎక్కువ శాతం అశ్విని ఈ వారం ఎలిమినేట్ కాబోతుందని తెలుస్తోంది. రతిక ఇదివరకే ఒకసారి హౌస్ నుంచి బయటకు వెళ్లి తిరిగి వైల్డ్ కార్డు ద్వారా లోపలికి వచ్చారు కనుక ఈమెను టాప్ ఫైవ్ వరకు బిగ్ బాస్ తీసుకువెళ్తారని వార్తలు వినపడుతున్నాయి. రతికను పక్కా ప్లాన్ తోనే తిరిగి హౌస్ లోకి తీసుకువచ్చారని సమాచారం. ఈ వారం అశ్విని ఎలిమినేట్ కాబోతున్నారని తెలుస్తుంది.