Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఒకప్పుడు రాజకీయ నాయకుడు అని తెలుసు కదా. ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. కానీ.. ప్రజారాజ్యం పార్టీ అంతగా ఉమ్మడి ఏపీలో ప్రభావం చూపించలేకపోయింది. సినిమాల్లో చిరంజీవిని మెగాస్టార్ గా చూసే జనాలు.. రాజకీయాలకు వచ్చేసరికి ఆయన్ను అస్సలు పట్టించుకోలేదు. అభిమానం ఉంటే సినిమాల్లో కానీ.. ఓట్లు వేయం అంటూ ఆయన్ను ఘోరంగా ఓడించారు.
అయితే.. చిరంజీవికి పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ ప్రచారంలో చాలా అవమానాలు, సవాళ్లు ఎదురయ్యాయి. ఒకసారి తెలంగాణలోని జగిత్యాలకు వెళ్తే అక్కడి స్థానికులు చిరంజీవిపై కోడిగుడ్లతో దాడి చేశారట. దీంతో చిరంజీవి ఆ ఘటనను చాలా అవమానంగా ఫీల్ అయ్యారట. అప్పటి నుంచి రాజకీయాలకు దూరం అవ్వాలని చిరంజీవి అనుకున్నారట. ఈ విషయాన్ని చిరంజీవే నిజం విత్ స్మిత అనే పేరుతో వస్తున్న టాక్ షోలో చెప్పారు.
Chiranjeevi : చిరంజీవి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్
సింగర్ స్మిత హోస్ట్‌గా సోనీ లివ్ ఓటీటీలో నిజం విత్ స్మిత అనే షో త్వరలో ప్రసారం కానుంది. అందులో చిరంజీవి మొదటి గెస్ట్. ఆ టాక్ షోలో గెస్ట్ గా వచ్చిన చిరు తన సినిమాలు, వ్యక్తిగత విషయాలు, రాజకీయాల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో పార్టీ ప్రచారం కోసం వెళ్లినప్పుడు కొందరు వ్యక్తులు తన మీద కోడిగుడ్లతో దాడి చేశారని.. అది వాళ్ల కుసంస్కారం అని తాను ఏం అనకుండా ఆ అవమానాలను భరించి వెనుదిరిగానని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే.. ఆ ఘటన చిరంజీవిని బాగా బాధించడంతో పాటు.. ఇప్పుడు చిరంజీవి రాజకీయాలను వదిలేయడానికి కూడా ఒక కారణం అని చెప్పుకోవచ్చు.