Chiranjeevi Family : చిరంజీవి అంటే ఒక మెగాస్టార్. టాలీవుడ్ మాత్రమే కాదు.. దేశమంతా చిరంజీవి గురించి తెలియని వాళ్లు ఉండరు. ఇప్పుడంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలు వస్తునాయి కానీ.. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక దశ, దిశను చూపిందే చిరంజీవి. ఆయన అడుగుజాడల్లోనే ఇప్పటికీ చాలామంది హీరోలు నడుస్తున్నారు. ఆయన సినిమా కెరీర్ సూపర్ సక్సెస్. మెగాస్టార్ అయ్యారు. ఇప్పటికీ మెగాస్టార్ గానే కొనసాగుతున్నారు. అది చిరంజీవి గొప్పతనం. అయితే.. చిరంజీవి సినిమా కెరీర్ బాగానే ఉంది కానీ.. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం చాలా డిస్టర్బ్ అనే చెప్పుకోవాలి. వ్యక్తిగత జీవితం అంటే ఆయన పర్సనల్ లైఫ్ కాదు.. ఆయన ఇంట్లోని ఆయన ఫ్యామిలీ జీవితాల గురించి మనం చెప్పుకునేది.
ఎందుకంటే.. చిరంజీవి ఫ్యామిలీ ఇంట్లోని లేడీస్ కి పెళ్లి సమస్యలు ఉన్నట్టున్నాయి. ఆయన చిన్నకూతురు శ్రిజ రెండు పెళ్లిళ్లు చేసుకొని ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ముందు తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తన చిన్ననాటి ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
Chiranjeevi Family : నాగబాబు కూతురు నిహారిక పరిస్థితి కూడా అంతేనా?
ఇక నాగబాబు కూతురు నిహారిక పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇద్దరూ కొన్ని రోజుల పాటు చాలా సంతోషంగా ఉన్నారు. కానీ వాళ్ల మధ్య మనస్పర్థలు వచ్చినట్టు తెలుస్తోంది. వాళ్లు విడిపోవడానికి రెడీగా ఉన్నారట. ఇక.. చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కూడా మొదట్లో ఎంగేజ్ మెంట్ అయి పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇలా.. మెగా ఫ్యామిలీలో లేడీస్ కి పెళ్లిళ్ల విషయంలోనే ఇలాంటి ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అని మెగా అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఒక స్టార్ హీరో ఇంట్లో ఇలాంటి సమస్యలు రావడం ఏంటి అని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు.