NTR: RRR మూవీ ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం సినీ అభిమానుల ఆదరణ పొందుతుంది. ఇండియాలో పెద్ద హిట్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ వేరే దేశాల ప్రజలు కూడా ఇంతలా కనెక్ట్ అవుతారని ఎవ్వరూ ఊహించలేదు. ఏకంగా ఇప్పుడు గోల్డెన్ గోల్బ్స్ అవార్డులో బెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆస్కార్ బరిలో కూడా RRR ఉంది. ఇప్పటికే కొన్ని కేటగిరీలలో అవార్డు కంఫర్మ్ అయ్యిందని సినీ ప్రముఖులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు RRR లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అయితే ఈ ఇద్దరిలో ఇండియాలోనూ, ఇతర దేశాల్లోనూ రామ్ చరణ్ కు ఎక్కువ క్రేజ్ వచ్చింది. ఇండియాలో అయితే రామ్ చరణ్ నే మెయిన్ హీరోగా చూస్తూ, ఎన్టీఆర్ ను సైడ్ క్యారెక్టర్ గా నార్త్ ఆడియన్స్ చూస్తున్నారు. ఒక ప్రెస్ మీట్ లో ఏకంగా ఒక రిపోర్టర్ నేరుగా ఎన్టీఆర్ నే అడుగుతూ…”క్రెడిట్ మొత్తం రామ్ చరణ్ కు వస్తుంది, మీరెలా ఫీల్ అవుతున్నారని “అడిగారు. దింతో ఎన్టీఆర్ అభిమానులు చాలా ఫీల్ అయ్యారు. ఆ ప్రెస్ మీట్ తరువాత నుంచి రాజమౌళి డ్యామేజ్ కంట్రోల్ ను మొదలు పెట్టారు.
ఎన్టీఆర్ ను , ఎన్టీఆర్ అభిమానులను ఓదార్చడానికి ఎక్కడ ప్రెస్ మీట్ జరిగినా, మూవీ గురించి ఎవరు అడిగినా ఎన్టీఆర్ ను తెగ పొగుడుతున్నారు. కొమురం భీముడొ పాటలో ఎన్టీఆర్ చేసిన నటన అద్భుతమని, అదే తన డైరెక్షన్ లో ఇప్పటి వరకు బెస్ట్ సీన్ అని, అందులో ఎన్టీఆర్ యాక్టింగ్ చాలా గ్రేట్ అని అడిగినా, అడగకపోయినా పొగుడుతూనే ఉన్నారు. ఇప్పుడు లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఆస్కార్ ఓటర్స్ స్క్రీనింగ్ లో కూడా ఎన్టీఆర్ ను రాజమౌళి తెగ పొగుడుతున్నారు. అక్కడ కూడా కొమురం భీముడొ పాటలో ఎన్టీఆర్ నటన అద్భుతమని, జస్ట్ ఒక కనుబొమ్మ మీద షాట్ పెట్టినా కూడా ఎన్టీఆర్ యాక్టింగ్ చేయగలడని అన్నారు. ఇదే ఈవెంట్ లో రామ్ చరణ్ ను మాత్రం తీసేసినట్టు మాట్లాడాడు.
ఇండియాలో ఎన్టీఆర్ కు, ఎన్టీఆర్ అభిమానులకు జరిగిన అవమానాన్ని తొలగించడానికే రాజమౌళి ఇలా ఎన్టీఆర్ భజన చేస్తున్నారని మెగా అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే రాజమౌళి ఎన్టీఆర్ తనకు ఇష్టమైన నటుడని ఎప్పుడూ చెప్తాడు కానీ RRR మూవీలో మాత్రం ఎన్టీఆర్ కు సపోర్ట్ క్యారెక్టర్ లాంటి పాత్రను ఇచ్చాడని, ఇప్పుడు ఎన్టీఆర్ ను ఎంత పొగిడినా కూడా తాము రాజమౌళిని నమ్మలేమని, రాజమౌళికి ఎన్టీఆర్ దూరంగా ఉంటేనే బెటర్ అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు ఎంత కష్టపడ్డా కూడా తనకు RRR మూవీలో సరైన గుర్తింపు రాలేదని ఎన్టీఆర్ బాధపడుతున్నాడని, డిప్రెషన్ లోకి కూడా వెళ్లాడని మీడియాలో కూడా వార్తలు వచ్చాయి. అయితే Variety అనే మ్యాగజిన్ యొక్క ఆస్కార్ కు నామినేట్ అయ్యే ఆక్టర్స్ ప్రిడిక్షన్ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. టాప్ 10లో ఇండియన్ ఆక్టర్ ఉండటం ఇదే మొదటిసారి.