Woman : మామూలుగా కొందరు పెద్దలు 1000 అబద్దాలు ఆడి అయినా సరే ఒక పెళ్లి చేయాలని చెబుతూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లి చేయడం కోసం ఆడరాని అబద్ధాలు ఆడటం అలాగే చేయరాని మోసాలు చేస్తున్నారు. ఈమధ్య కొందరు అడ్డదారుల్లో డబ్బు సంపాదించాలనే ఆశతో తీవ్ర నేరాలకు పాల్పడుతున్నారు. మరికొందరైతే మరియు మోసాలు చేస్తూ ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అయితే తాజాగా ఓ మహిళ కొత్తగా పెళ్లి చేసుకుని నవ జీవితాన్ని ఆరంభించాలని ఆశ పడింది. కానీ ఫస్ట్ నైట్ రోజున తన భర్త చేసిన నిర్వాకం కారణంగా తీవ్ర నిరాశకు గురైన ఘటన ఇండోనేషియా దేశంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాలకు వెళితే స్థానిక దేశంలో 28 సంవత్సరాలు కలిగినటువంటి ఓ యువతి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటోంది. అయితే ఇటీవల ఈ యువతి తన కుటుంబ సభ్యులతో విభేదాలు రావడంతో కొంత మేర వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో పెళ్లి ఈడు రావడంతో తన బంధువులు మరియు పండితుల సలహా మేరకు పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో తనకు కాబోయే వరుడు కోసం సోషల్ మీడియా మాధ్యమాలలో వెతికింది.
ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడి పెళ్లి కూడా చేసుకుంది. అలాగే దాదాపుగా పదిహేను లక్షల రూపాయలకుపైగా కట్నం కూడా చెల్లించింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.
దీంతో యువతి కుటుంబ సభ్యులు కూడా పెళ్లి శుభకార్యం కావడంతో పెళ్లికి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించి అత్తారింటికి సాగనంపారు. దీంతో నవ వధువు తన వైవాహిక జీవితం కొత్త ప్రారంభానికి ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కానీ ఫస్ట్ నైట్ రోజున తన భర్త ఇచ్చిన కృష్ణ చూసి ఒక్కసారిగా అవాక్కయ్యింది. అయితే తన భర్త అసలు మగాడు కాదని అమ్మాయి అని తెలుసుకుంది. అలాగే అమ్మాయి ఏకంగా కట్నం డబ్బులు కోసం ఆశపడి మగవాళ్ళ వేషధారణలో వచ్చి మహిళల్ని పెళ్లి చేసుకొని మోసం చేస్తూ ఉంటుందని తెలిసి నివ్వెరపోయింది. ఇంకేముంది చివరికి దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి తన భర్త గాని భర్తపై ఫిర్యాదు చేసి కటకటాల్లోకి నెట్టించింది.