Yadamma Raju:యాదమ్మ రాజు పరిచయం అవసరం లేని పేరు ఈయన జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం సోషల్ మీడియాలో కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఎన్నో విషయాలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి యాదమ్మ రాజు ప్రస్తుతం సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్.
ఈ సినిమాలో యాదమ్మ రాజు హీరో ఫ్రెండ్ పాత్రలో నటించారు. అయితే గత కొద్ది రోజుల క్రితం యాదమ్మ రాజు ప్రమాదానికి గురయ్యారని తన కాలు ఫ్రాక్చర్ కావడంతో హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు అంటూ ఒక వీడియో వైరల్ గా మారిన సంగతి మనకు తెలిసిందే. అయితే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి యాదమ్మ రాజు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తనకు జరిగిన ప్రమాదం గురించి తెలియజేశారు.
Yadamma Raju: నా తప్పు ఏమీ లేదు…
తనకు ఈ ప్రమాదం జరగడంలో తన తప్పు ఏమీలేదని తెలిపారు. తాను చాయ్ తాగడం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాను. ఒక వ్యక్తి బైక్ లో చాలా స్పీడ్ గా రావడం వెంటనే స్కిడ్ కావడంతో ఆ బండి వచ్చి నా కాలిపై పడిందని దాంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. అయితే ఈ ప్రమాదం కారణంగా తన కాలు వేలు తీసేసారు అంటూ ఈ సందర్భంగా తనకు జరిగిన ప్రమాదం గురించి యాదమ్మ రాజు చెబుతూ కామెంట్ చేశారు. అయితే తన కాలు ఇలా ఉన్నప్పటికీ సినిమా ప్రమోషన్లకు ఈయన హాజరు కావడంతో నటన పట్ల ఈయనకి ఉన్నటువంటి గౌరవం గురించి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.