Yamini :సినిమా ఇండస్ట్రీ ఏదైనా కాస్టింగ్ కౌచ్ సమస్య మాత్రం మహిళలను వెంటాడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికితోడు ఈ మధ్యకాలంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ సమస్యపై అవగాహన పెరగడంతో క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినటువంటి వ్యక్తులు స్వతహాగా తమ అనుభవాలను నటిజనులతో పంచుకుంటున్నారు. దీంతో ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతూ దేశ నలుమూలలా వ్యాపిస్తున్నాయి. అయితే తాజాగా భోజ్ పూరి సినీ పరిశ్రమకు చెందినటువంటి యంగ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఓ స్టార్ హీరోపై చేసిన క్యాస్టింగ్ కౌచ్ కామెంట్లు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే నటి యామిని సింగ్ గత కొద్ది కాలంగా భోజపురి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా, అలాగే స్పెషల్ సాంగ్స్ వంటి వాటిలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటుంది. ఐతే తాజాగా నటి యామిని సింగ్ తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపింది. ఈ క్రమంలో తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎవరూ తెలియకపోవడంతో అవకాశాల పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాగే ఆఫర్లను ఆశగా చూపి తనతో లైంగిక కోరికలు తీర్చుకోవాలనుకున్న వాళ్లు కూడా చాలామంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో అప్పటికే భోజపురి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా రాణిస్తున్న పవన్ కూడా తనునే లైంగికంగా లోబరుచుకోవాలని చూశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకి పవన్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో కలిసి నటించే అవకాశం వచ్చిందని దీంతో ఓ రోజున పవన్ అర్థరాత్రి సమయంలో కాల్ చేసి ఒంటరిగా తాను ఇంటికి రావాలని తన లైంగిక కోరికలు తీర్చాలని పరోక్షంగా వేధించాడని చెప్పుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా భోజపురి సినిమా ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. అలాగే ఈ విషయం భోజపురి సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడంతో కొందరిని నెటిజన్లు ఈ విధంగా స్పందిస్తున్నారు.
ఇందులో ముఖ్యంగా చాలామంది తమ పరపతి, డబ్బు, ఫేమ్, వంటివి అడ్డుపెట్టుకొని అవకాశాల కోసం వచ్చే వాళ్ళని లైంగిక కోరికలు తీర్చుకోవాలని చూస్తున్నారని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలను కోరుతున్నారు. అలాగే ఎన్నో ఆశలతో, కలలతో నటి కావాలని ఇండస్ట్రీకి వచ్చేవారికి ఇలాంటి చేదు అవంతరాలు ఎదురైతే భవిష్యత్తులో ఇండస్ట్రీకి రావాలంటే యువత భయపడతారని కాబట్టి ఆదిలోనే వీటిని అణిచివేయడం మంచిదని కూడా సూచిస్తున్నారు.