Mohan Babu : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దాదాపుగా 400 పైగా చిత్రాల్లో నటించి హీరోగా విలన్ గా అలాగే సినీ నిర్మాతగా ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ లెజెండరీ నటుడు మంచు మోహన్ బాబు గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటుడు మంచు మోహన్ బాబు తన నట వారసులుగా తన ఇద్దరు తనయులయిన మంచు విష్ణు మరియు మంచు మనోజ్ తదితరులను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. వీరు కూడా అడపాదడపా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు.
కానీ ఈమధ్య కాలంలో కొందరు మంచు ఫ్యామిలీ ని టార్గెట్ చేస్తూ వారి గురించి అసభ్యకర మరియు అసత్య ప్రచారాలను చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. అయితే తాజాగా మంచు ఫ్యామిలీ కుటుంబ సభ్యుల గురించి తెలుగు యువ నటి గీతాంజలి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో స్పందించింది.
ఇందులో భాగంగా మంచు ఫ్యామిలీ గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో మరియు సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నదంతా అవాస్తవమని తెలిపింది. అలాగే తాను ఇప్పటివరకూ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచు ఫ్యామిలీ తో వర్క్ చేయడం చాలా బాగుందని తెలిపింది. అంతేకాకుండా మంచు ఫ్యామిలీతో వర్క్ చేసేటప్పుడు సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి పూర్తయ్యేంత వరకూ పూర్తి బాధ్యతగా వ్యవహరిస్తారని అంతేకాకుండా ప్రతిదీ ప్రొఫెషనల్ గా చేస్తూ పని పూర్తయ్యాక పారితోషకం ఏకంగా ఇంటికి తెచ్చిస్తారని తెలిపింది.
అంతేకాకుండా వారితో పని చేసేటప్పుడు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ఈ విషయం తనకు బాగా నచ్చిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం తాను మంచు విష్ణుతో కలిసి గాలి నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నట్లు కూడా తెలిపింది. ఈ క్రమంలో సినిమా షూటింగ్ సెట్స్ లో మంచు విష్ణు చాలా హుందాగా ఉంటాడని అంతేకాకుండా ప్రతి ఒక్కరిని గౌరవ మర్యాదలతో పలకరిస్తారని తెలిపింది.
ఇక గాలి నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్న బాలీవుడ్ నటి సన్నీలియోన్ గురించి కూడా పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో తెలియజేసింది. అయితే నటి సన్నీ లియోన్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ హోదా వంటివి ఉన్నప్పటికీ తన తోటి నటీనటులతో మరియు సెట్ బాయ్స్ తో చాలా సరదాగా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ఏదైనా కష్టం వచ్చిందని తెలిస్తే ఏమీ ఆలోచించకుండా రెస్పాండ్ అవుతుందని సన్నిలియోన్ మనస్తత్వం గురించి తెలిపింది. అయితే ఒక్కోసారి గతంలో పరిస్థితుల కారణంగా చేసినటువంటి పనులనుబట్టి భవిష్యత్తు నిర్ణయించ కూడదని అభిప్రాయం వ్యక్తం చేసింది.