Roopa : ఈ మధ్యకాలంలో చాలామంది డిజిటల్ మనీ సంపాదించడంలో బాగా ఆరితేరారని చెప్పవచ్చు. దీంతో గత ఏడాది యూట్యూబ్ మరియు గూగుల్ సంస్థలు కూడా డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్ బాగా పెరిగారని దీంతో డిజిటల్ మనీ సంపాదన కూడా పెరిగిందని ఈ క్రమంలో దాదాపుగా 6000 కోట్ల రూపాయలు టర్నోవర్ జరిగినట్లు సంస్థలు వెల్లడించాయి. దాంతో చాలామంది యూట్యూబ్లో ఛానల్స్ క్రియేట్ చేసి వంటలు, రివ్యూలు, వ్లాగ్స్, చదువులు ఇలా రకరకాల వాటికి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెలకి పెద్ద మొత్తంలోనే డబ్బులు సంపాదిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరికొందరు మాత్రం ఘాటుగా అందాలు ఆరబోస్తూ వ్యూస్ సంపాదిస్తున్నారు.
అయితే యూట్యూబ్ లో చాలామంది మహిళలు వంటలకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తుండడంతో మనం గమనిస్తూ ఉంటాం. ఇంకొందరు తెలివిగా ఆలోచిస్తూ నెటిజెన్లను ఆకట్టుకుని వ్యూస్ తెచ్చుకునేందుకు ఏకంగా వంటలతో పాటు అందాలు కూడా వడ్డిస్తున్నారు. కాగా యూట్యూబ్ లో ఎల్లీ ప్రొడక్షన్స్ అనే ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే ఈ ఛానెల్ లో షేర్ చేసినటువంటి వీడియోలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ వీడియోలో రూపా అనే యువతీ విలేజ్ స్టైల్ లో వంటలు వండుతూ నటిజనులను బాగానే ఆకట్టుకుంటుంది.
అయితే ఈ వీడియోలో కేవలం రూప వండిన వంటలు మాత్రమే కాకుండా ఆమె అందచందాలు కూడా బాగానే ఆరబోస్తోంది. దీంతో రూప వంటలకి మాత్రమే కాదు ఆమె అందానికి కూడా నెటిజన్లు ఫిదా అయ్యారు. అలాగే ప్రస్తుతం ఎల్లి ప్రొడక్షన్ కి 1,50,000 పైచిలుకమందిని సబ్ స్క్రయిబర్స్ ఉన్నారు. దీంతో రూప ఈ వంటల వీడియోల ద్వారా నెలకి దాదాపుగా లక్ష రూపాయలు నుంచి 2 లక్షల రూపాయలు వరకు ఆదాయం సంపాదిస్తున్నట్లు సమాచారం.
అయితే రూపా మాత్రమే కాదు విలేజ్ స్టైల్ లో కుకింగ్ వీడియోలు చేస్తూ యామిని, శీల, మరింత మంది మహిళలు కూడా తమ వంటలు అలాగే అందాలతో నేటిజనులను కట్టిపడేస్తున్నారు. ఇక మన తెలుగులో అయితే ప్రముఖ తెలుగు నటి శ్రీ రెడ్డి కూడా ఇదే కోవలో ట్రై చేస్తూ బాగానే సంపాదిస్తోంది.