Citroen eC3 : ఈరోజుల్లో కారు కొనాలంటే అంత ఈజీ కాదు. కొన్నా కూడా దాన్ని మెయిన్ టెన్ చేయడం అనేది చాలా కష్టమైన పని. కానీ.. ఫ్రెంచ్ కు చెందిన సిట్రోయెన్ అనే కార్ల బ్రాండ్ తాజాగా ఈసీ3 అనే ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ కారును తాజాగా మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ కారును సొంతం చేసుకోవాలనుకుంటే రూ.25 వేలు కడితే చాలు. కారును బుకింగ్ చేసుకోవచ్చు. కారును ఆన్ లైన్ లో కంపెనీ వెబ్ సైట్ లోకి వెళ్లి బుక్ చేసుకోవచ్చు. లేదంటే సిట్రోయెన్ అథరైజ్డ్ డీలర్ షిప్ వద్ద అయినా బుకింగ్ చేసుకోవచ్చు.
ఈ కారును ముందు బుక్ చేసుకున్న వారికి వచ్చే నెల ఫిబ్రవరి నుంచి డెలివరీ చేయనున్నారు. ఇది సిట్రోయెన్ నుంచి వచ్చిన ఎంట్రీ లేవల్ కారు. ఇది ఎలక్ట్రిక్ కారు. అయితే.. ఈ కారులో అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. బేసిక్ మోడల్ కారు ధర రూ.9 లక్షలు కాగా.. హై ఎండ్ మోడల్ కారు ధర రూ.13 లక్షలుగా ఉంది.
Citroen eC3 : అత్యాధునికమైన ఫీచర్లతో లాంచ్
సిట్రోయెన్ కారును అత్యాధునికమైన ఫీచర్లతో లాంచ్ చేశారు. ఈ కారు దాని ఐసీఈ వెర్షన్ ను పోలి ఉంటుంది. కాకపోతే ఇది ఫ్రంట్ ఫెండర్ పై కొత్త చార్జింగ్ పోర్ట్ ను కలిగి ఉంటుంది. దీనికి టెయిల్ పైప్ ఉండదు. కొత్త డ్రైవ్ కంట్రోలర్ ఉంటుంది. సవరించిన సెంటర్ కన్సోల్ ఉంటుంది. 57 బీహెచ్పీ పవర్, 143 ఎన్ఎం టార్క్, హ్యాచ్ బ్యాక్ ఎకో, స్టాండర్డ్ డ్రైవింగ్ మోడ్స్, ఏఆర్ఏఐ రేటెడ్ రేంజ్, డీసీ ఫాస్ట్ చార్జర్, 3.3 కేడబ్ల్యూ ఆన్ బోర్డ్ ఏసీ చార్జర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, స్పీకర్ ఆడియో సిస్టమ్, కార్ టెక్, డ్యుయల్ ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్ యాంటీ లాక్ ఈబీడీ లాంటి ఫీచర్లతో ఈ కారును లాంచ్ చేశారు.