Video Call నేటి ప్రపంచంలో డబ్బు ఈజీగా సంపాదించటం కోసం… చాలా మంది అడ్డదారులు తొక్కుతున్నారు. భర్త సరైన మార్గంలో వెళ్లకపోతే భార్య తప్పు అని చెప్పి ఆ పనులు మాన్పించాలి. కానీ ఈ స్టోరీ లో మాత్రం భార్య భర్తలు కలిసి కట్టుగా ఓ పథకం ప్రకారం భారీ మొత్తంలో సంపాదించారు. దాదాపు రూ. 20 కోట్ల రూపాయలు దోచుకున్నారంటే… వాళ్ళు సంన్యులు కాదనే చెప్పాలి. భారీ స్థాయిలో ఈ సొమ్ము దోచుకోవటానికి వందలమందిని ఈ జంట మోసం చేశారు. ఇంత సొమ్ము దోచుకోవటానికి వాళ్ళు ఉపయోగించుకున్న ఏకైక సాధనం వాట్సాప్ వీడియో కాల్.
అవును… వాట్సాప్ ను ఉపయోగింకే వారు ఇంత పెద్ద మొత్తం లో డబ్బు కాజేశారు. కాకపోతే ఆ వీడియో కాల్స్ మామూలుగా కాకుండా నగ్నంగా చేసేవారు. ఓ విదేశీ వ్యక్తి ఇచ్చిన సలహాని ఆచరణలో కోట్ల రూపాయలు దండుకున్నారు ఈ భార్య భర్తలు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఘాజియాబాద్ లో సప్నా గౌతమ్, యోగేశ్ భార్యాభర్తలు గా వుంటున్నారు. వీరికి ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆశ పుట్టి రకరకాల ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ దంపతులకి ఆస్ట్రేలియాకి చెందిన ఓ వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. అలా నగ్నంగా ఫోన్ లో వీడియో కాల్స్ మాట్లాడి… వాటిని రికార్డ్ చేసి ఆ తర్వాత అవతల వారి నుంచి డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. ఈ పనులు చేయటానికి ఆ జంట కొంత మంది యువతులను కూడా నియమించుకున్నారు. ఆ యువతులకి కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలనే అంశంపై స్వప్న శిక్షణ ఇచ్చేది. యోగేష్, స్వప్న ఓ వెబ్ సైట్ లో వారి వివరాలు రిజిస్టర్ చేసుకున్నారు. ఆ వెబ్ సైట్ వాళ్లు ఇచ్చిన ఐడీలతో కోరుకున్న కస్టమర్స్ కి నగ్నంగా ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇలా వీడియోలో నగ్నంగా మాట్లాడితే నిమిషానికి రూ.200 తీసుకుంటారు. అందులో సగం వైబ్ సైట్ వాళ్లు తీసుకుంటే మిగిలిన సగం నగ్నంగా ఫోన్ చేసి మాట్లాడిన వాళ్లకి వస్తుంది.
యోగేష్ ఆ వెబ్ సైట్ నుంచి సేకరించిన నెంబర్స్ కి ఫోన్ చేసి… వెబ్ సైట్ కంటే తక్కువ రేటుకే తాము సర్వీస్ ఇస్తామంటూ మాట్లాడేవాడు. అలా ఒప్పుకున్న వారికి వాట్సాప్ లేదా ఇతర మాద్యమల ద్వారా నగ్నంగా అమ్మాయిల చేత వీడియో కాల్స్ చేయించే వారు. ఈ భార్యభర్తలు ఆ దృశ్యాలను రికార్డ్ చేసి… ఆ తర్వాత రికార్డ్ చేసిన నగ్న వీడియోలు ఆన్ లైన్ పెడతామని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేసేవారు. ఇలా ఈ దంపతులు దాదాపు 300 మందిని బెదిరించి డబ్బులు గుంజుకున్నారు. ఇలా నగ్నంగా వీడియో కాల్ చేసే అమ్మాయిలకి నెలకు రూ. 25 వేలు, మెసేజ్ లు చేసే వారికి రూ.15 వేలు జీతంగా ఇస్తుంది. అయితే ఒక కంపెనీ యజమాని తన కంపెనీ ఖాతా నుంచి రూ.80 లక్షలు మాయం అయినట్లు గుజరాత్ లోని రాజ్ కోట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. దీంతో వీళ్ల దందా విషయం వెలుగు చూసింది. ఆ కంపెనీలో ఓ ఉద్యోగి ఆ రూ.80 లక్షలు ఈ దంపతులుకి ట్రాన్స్ఫర్ చేశాడు. రాజ్ కోట్ పోలీసులు ఘజియాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేయటంతో … వీళ్ల విషయం బయట పడింది. పోలీసులు యోగేష్ , స్వప్నతో పాటు… మరో ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు.