delhi to get 100 ev charging stations for electric vehicles charging

Charging Stations : పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటడంతో ఇక చేసేది లేక అందరూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, బైకులను కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు ఒక్కసారి తీసుకుంటే చాలు.. వాటిలో పెట్రోల్, డీజిల్ కొట్టించాల్సిన అవసరమే ఉండదు. చార్జింగ్ ఫుల్ చేసుకొని బైక్ ఎక్కి ప్రయాణం చేయొచ్చు. పర్యావరణానికి కూడా పెద్దగా హాని ఉండదు ఈ వాహనాల వల్ల. అందుకే చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు.

 

ఈవీల విషయంలో అంతా బాగానే ఉంది కానీ.. బయట సడెన్ గా చార్జింగ్ అయిపోతే ఎలా.. అనేదే పెద్ద ప్రశ్నగా మారింది. భారత్ లో ఇంకా చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయలేదు. ఎక్కడో ఒక చోట మాత్రమే చార్జింగ్ స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ.. త్వరలో చాలా ఆటోమొబైల్ కంపెనీలు ఈవీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా 100 ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లను తీసుకొస్తున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఢిల్లీలోని పలు మెట్రో స్టేషన్లు, బస్ డిపోలు, ఇతర ప్రాంతాల్లో ఈ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు.

Charging Stations : ఏప్రిల్ చివర్లో 50 స్టేషన్లు

ఈ నెల ఏప్రిల్ చివరల్లోనే 50 స్టేషన్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరో మరో 50 స్టేషన్లు వచ్చే జులై నాటికి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే.. ఈవీ చార్జింగ్ స్టేషన్లలో ఒక్క యూనిట్ కు రూ.3 మాత్రమే తీసుకొని చార్జింగ్ ఫెసిలిటీ అందించననున్నారు. అంటే.. ఎన్ని యూనిట్ల చార్జింగ్ ను వినియోగిస్తే యూనిట్ కు 3 రూపాయల చొప్పున డబ్బులు తీసుకుంటారు. పీపీపీ మోడల్ లో ఢిల్లీ ప్రభుత్వం ఈ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానుంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఏప్రిల్ 7, 2023 at 8:17 ఉద.