Ravana Worshipped On Vijayadashami In These Places : దసరా పండుగ అంటే తెలుసు కదా. చెడు నుంచి మంచికి విజయం. మంచిని, విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే విజయదశమి. అయితే.. దసరా పండుగను పలు కారణాల వల్ల చేసుకుంటారు. దసరా పండుగ ఎందుకు చేసుకుంటామో పురాణాలు తరిచి చూస్తే చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రావణుడిని రాముడు సంహరించిన సందర్భంగా చెడుపై మంచి విజయానికి ప్రతీకగా విజయ దశమిని చేసుకుంటారు. ఆరోజు రావణుడి బొమ్మను సంహరించి పండుగ చేసుకుంటారు. మరోవైపు ఆ రోజు రావణుడిని పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో రావణుడి బొమ్మను దహనం చేస్తే మరికొన్ని ప్రాంతాల్లో రావణుడికి పూజలు చేస్తారు. అసలు రావణుడికి కొన్ని ప్రాంతాల్లో ఆలయాలు కూడా ఉన్నాయి.
చాలా ప్రాంతాల్లో రావణుడిని పూజిస్తారు. ప్రత్యేకంగా దసరా రోజు రావణుడిని పూజిస్తారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నివసించే గోండు జాతికి చెందిన వాళ్లు రావణుడిని తమ దేవుడిగా కొలుస్తారు. వీళ్లు రావణుడిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. విజయదశమి రోజు రావణుడి బొమ్మలను అలంకరించి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. రావణుడి వారసులుగా వాళ్లు భావిస్తారు.అలాగే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మందసౌర్ లో రావణుడిని పూజిస్తారు. మందసౌర్ అనేది రావణుడి భార్య మండోదరి గ్రామం. అందుకే రావణుడిని అక్కడి వాళ్లు తమ అల్లుడిగా భావించి ఆయన్ను పూజిస్తారు. ఇక్కడ రావణుడి విగ్రహం ఉంటుంది. దానికి పూజలు చేస్తారు.
Ravana Worshipped On Vijayadashami In These Places : రావణుడి జన్మస్థలంలో ప్రత్యేక పూజలు
ఉత్తరప్రదేశ్ లోని బిస్రాఖ్ ప్రాంతం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. అందుకే.. రావణుడిని అక్కడ పూజిస్తారు. దసరా రోజు అయితే ప్రత్యేక పూజలు చేస్తారు. మహా బ్రాహ్మణుడిగా రావణుడిని ఇక్కడి వాళ్లు భావిస్తారు. అలాగే.. ఉత్తరాఖండ్ లోని కాంగ్రా అనే ప్రాంతంలోనూ రావణుడిని దేవుడిగా కొలుస్తారు.
రాజస్థాన్ లోని మండోర్ లోనూ రావణుడిని దేవుడిగా భావిస్తారు. ఇలా.. పలు ప్రాంతాల్లో రావణుడిని దేవుడిగా భావించి పూజలు నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో దశానన్ మందిర్ అని రావణుడి కోసం నిర్మించిన దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని కేవలం దసరా రోజు మాత్రమే తెరుస్తారు. అక్కడ దసరా రోజు రావణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అలా చాలా ప్రాంతాల్లో రావణుడికి దేవాలయాలు ఉన్నాయి. దసరా రోజు ఆయా ప్రాంతాల్లో రావణుడి దహనం చేయరు. ఆరోజున ఆయనకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు.