Electric Auto : ఇది ఎలక్ట్రిక్ వాహనాలు జనరేషన్. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వెంట పడుతున్నారు. అందులోనూ చాలా కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. బైక్స్ దగ్గర్నుంచి ఆటోలు, కార్లు అన్నీ ఎలక్ట్రిక్ బాట పడుతుండటంతో జనాలు కూడా అవి కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అల్టీగ్రీన్ అనే కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ తాజాగా ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసింది.అత్యాధునికమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఆటోను లాంచ్ చేసింది. ఇది కార్గో ఆటో. దీనికి ఉండే బ్యాటరీ ఎన్ఈఈవీ. ఇది కొత్త వేరియంట్. ఎక్స్పోనెంట్ ఎనర్జీ బ్యాటరీ ప్యాక్ ఉండటం వల్ల ఇది ఫాస్ట్ చార్జింగ్ వెహికిల్ గా చెప్పుకోవచ్చు.
కేవలం 15 నిమిషాల్లోనే ఈ ఆటోకు చార్జ్ చేయొచ్చు. 8.2 కేడబ్ల్యూహెచ్ ఈప్యాక్ ఇది. ఈ బ్యాటరీలను ఎక్స్ పోనెంట్ ఎనర్జీ తయారు చేయడం వల్ల ఎన్ఈఈవీ తేజ్ ఫాస్ట్ చార్జర్ గా మారింది. దీనికి ఒకసారి చార్జింగ్ పెరిగితే చాలు.. 100 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. సిటీలో అయితే 85 కిమీ రేంజ్ లో మైలేజ్ వస్తుంది. ఈ వాహనానికి 5 ఏళ్ల వరకు వ్యారంటీ ఉంటుంది. లేదంటే లక్ష కిమీల వారంటీ కూడా ఉంటుంది. బ్యాటరీ వారంటీ 5 ఏళ్ల వరకు ఉంటుంది.
Electric Auto : బ్యాటరీ వేగంగా చార్జ్ అవడం కోసం అల్టీగ్రీన్, ఎక్స్ పోనెంట్ ఎనర్జీ మధ్య ఒప్పందం
వేగంగా బ్యాటరీని చార్జ్ చేయడం కోసం అల్టీగ్రీన్, ఎక్స్ పోనెంట్ ఎనర్జీ అనే కంపెనీల మధ్య ఒప్పందం కుదిరింది. ఎలక్ట్రిక్ వాహనాలకు అత్యంత వేగంగా చార్జింగ్ ను అందించేందుకే ఈ సంస్థలు చేతులు కలిపాయి. ఈ రెండు కంపెనీల భాగస్వామ్యంతో వచ్చిందే ఈ ప్రొడక్ట్ ఎన్ఈఈవీ తేజ్. ఇందులో లిక్విడ్ కూల్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్ చేస్తుంది. కార్గో సేవలు అందించాలనుకునే వారికి ఈ వాహనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా ఒకసారి చార్జ్ చేస్తే చాలు 100 కిలోమీటర్ల వరకు ఏంచక్కా తిరగొచ్చు. ఇప్పటికైతే ఈ ఆటోను లాంచ్ చేశారు కానీ ఇంకా సేల్స్ ప్రారంభించలేదు. ఈ ఆటో ధర రూ.3.55 లక్షలుగా కంపెనీ పేర్కొంది. ఈ ఆటో మూడు వేరియంట్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. ఒకటి తేజ్, మరొకటి లో డెక్, ఇంకొకటి హైడెక్. తొలి దశలో 2000 ఎన్ఈఈవీ తేజ్ వాహనాలను కంపెనీ తయారు చేస్తోంది. భారత్ లోని 30 పట్టణాల్లో సేవలను విస్తరించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.