Free Movies and Web series App : ఒకప్పుడు సినిమా చూడాలంటే ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లాల్సిందే. కొత్త మూవీ ఏది రిలీజ్ అయినా అక్కడికే వెళ్లి చూడాలి. సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత ఆ మూవీ టీవీలోకి వస్తుంది. అప్పుడు ఇంటిల్లిపాది ఆ సినిమాను చూసేవారు. కానీ.. రోజులు మారాయి. జనరేషన్ కూడా మారింది. ఇది టెక్నాలజీ యుగం. అందుకే.. సినిమాలు కూడా నేరుగా ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు వెబ్ సిరీస్ ల కాలం వచ్చేసింది. సినిమాలు అనేది ఓల్డ్. ఇప్పుడంతా వెబ్ సిరీస్ లు, షార్ట్ మూవీస్ కాలం నడుస్తోంది.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్లీ ప్లస్ హాట్ స్టార్, ఆహా, జీ5 లాంటి ఓటీటీ యాప్స్ వచ్చేశాయి. ఈ యాప్స్ లో బోలెడన్ని వెబ్ సిరీస్ లు ప్రతి రోజు అప్ లోడ్ అవుతుంటాయి. ఇక అమెరికన్ వెబ్ సిరీస్ లకు నెట్ ఫ్లిక్స్ పెట్టింది పేరు. అయితే.. ఇవన్ని ఓటీటీలకు సబ్ స్క్రైబ్ చేసుకోవాలంటే డబ్బులు చాలా అవుతాయి. అందుకే అన్ని ఓటీటీల వెబ్ సిరీస్ లన్నీ ఒకేచోట ఫ్రీగా దొరికితే ఎలా ఉంటది. వావ్.. సూపర్బ్ అంటారా? అలాంటి యాప్ ఒకటి ఉంది. అందులో బఫరింగ్ ఉండదు. వీడియోలు కూడా హెచ్‌డీ క్లారిటీ. ఇంకెందుకు ఆలస్యం. ఆ యాప్ ఏంటో తెలుసుకుందాం రండి.
Free Movies and Web series App : ఆన్ స్ట్రీమ్ యాప్ లో అన్ని వెబ్ సిరీస్ లు ఉచితంగా
Onstream.so అనే వెబ్ సైట్ లో అన్ని రకాల అమెరికన్ వెబ్ సిరీస్ లు ఫ్రీగా దొరుకుతాయి. అవి హెచ్‌డీ క్లారిటీతో. ఎలాంటి బఫరింగ్ లేకుండా వీడియోలు ఇందులో ప్లే అవుతాయి. ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. యాప్ ఇన్ స్టాల్ చేసుకొని ఫ్రీగా అమెరికన్ షోలు, వెబ్ సిరీస్ లు చూడొచ్చు. మీ ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీ ఉండే.. టీవీకి కూడా ఈ యాప్ ను కనెక్ట్ చేసుకొని ఫ్రీగా వెబ్ సిరీస్ లు ఎంజాయ్ చేయొచ్చు.
ఈ యాప్ లో ఇంగ్లీష్ మూవీస్, సిరీస్, షోలు అన్నీ ఉంటాయి. నెట్ ఫ్లిక్స్ లో అప్ లోడ్ అయ్యే ప్రతి షో ఇందులో ఉంటుంది. ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలంటే ముందు వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో ఉన్న లింక్ క్లిక్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్, షోలు, అమెజాన్ ప్రైమ్ షోలు, మూవీస్, వెబ్ సిరీస్ లు, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ షోలు అన్నీ ఉచితంగా ఆన్ స్ట్రీమ్ యాప్ లో చూసేయొచ్చు.