Honda Shine 100 vs Bajaj CT 100X : బడ్జెట్ ధరలో బైక్స్ తీసుకోవాలని ఎవరైనా అనుకుంటారు. బడ్జెట్ ధరతో పాటు మైలేజీ ఎక్కువగా ఇచ్చే బైక్స్ వైపే చాలామంది మొగ్గు చూపుతుంటారు. అందులో బెస్ట్ బ్రాండ్స్ అంటే హోండా, హీరో, బజాజ్ అని చెప్పుకోవాలి. హోండా నుంచి ఇటీవల షైన్ 100 మోడల్ బైక్ లాంచ్ అయింది. ఇది బడ్జెట్ బైక్. దీంతో చాలామంది మధ్యతరగతి ప్రజలు ఈ బైక్ వైపు మొగ్గు చూపుతున్నారు. అలాగే.. బజాజ్ నుంచి సీటీ 110 ఎక్స్ బైక్ కూడా విడుదలయింది.
ఇది కూడా బడ్జెట్ ధరలో వచ్చిన బైకే. ఇది షైన్ 100 కి పోటీగా వచ్చింది. ఈ రెండు బైక్ లు సేమ్ ఫీచర్లతో లాంచ్ అయ్యాయి. రెండూ మధ్య తరగతి ప్రజలు బడ్జెట్ ధరలో దొరికేవే. కాకపోతే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. హోండా షైన్ 100 మోడల్ బైక్ 99.7 సీసీ ఇంజన్ ను కలిగి ఉంటుంది.
Honda Shine 100 vs Bajaj CT 100X : హోండా షైన్ 100 ధర రూ.64,900
హోండా షైన్ మోడల్ 7.6 హెచ్పీ పవర్, 8.05 ఎన్ఎమ్ పీక్ టార్క్యూను ప్రొడ్యూస్ చేస్తుంది. అదే బజాజ్ బైక్.. 115.45 సీసీ ఇంజన్ ఉంటుంది. 8.48 హెచ్పీ పవర్, 9.81 ఎన్ఎమ్ పీక్ టార్క్యూను కలిగి ఉంటుంది. హోండా షైన్ 100 ధర రూ.64,900. ఇది ఎక్స్ షోరూమ్ ధర. అదే బజాబ్ సీటీ 100 ఎక్స్ ధర రూ.67,700. రెండు బైక్స్ ను పోల్చితే షైన్ కంటే కూడా సీటీ 110 ఎక్స్ బైక్ వైపే మధ్య తరగతి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం.. సీటీ 110 ఎక్స్ బైక్ లో ఉండే డిజైన్, పవర్ ఫుల్ ఇంజిన్. అందుకే దీని వైపే బైక్ లవర్స్ మొగ్గు చూపుతున్నారు. అయితే.. హోండా కంపెనీ బైక్ కావాలనుకునే వారు బడ్జెట్ ధరలో షైన్ 100ను కూడా ప్రిఫర్ చేయొచ్చు.