Honda Electric Scooters : టూ వీలర్స్ కు హోండా కంపెనీ పెట్టింది పేరు. హోండా కంపెనీ అంటేనే ఇంజన్ బాగుంటుంది. మైలేజ్ ఎక్కువ వస్తుంది. అందుకే హోండా బైక్స్ కు ఎక్కువ డిమాండ్. ఈ మధ్యే హోండా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల వైపు జనాలు మొగ్గుచూపుతుండటంతో హోండా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ 2023 నుంచి ఈ సంవత్సరం పూర్తయ్యే లోపు రెండు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావడానికి హోండా కసరత్తులు చేస్తోంది. నిజానికి హోండా 2030 లోపు 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురావాలని యోచిస్తోంది. హోండా నుంచి వస్తున్న రెండు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హోండా యాక్టివాలోనూ ఎలక్ట్రిక్ వాహనం తీసుకురానుంది.
Honda Electric Scooters : దేశ వ్యాప్తంగా 6000 చార్జింగ్ స్టేషన్లు
కర్ణాటకలోని నర్సాపురలో ఉన్న హోండా ప్లాంట్ లో ఎలక్ట్రిక్ టూ వీలర్లను తయారు చేయనుంది హోండా. ఇండియాలోనే కాదు.. ఈ స్కూటర్లను ప్రపంచ మార్కెట్ లోకి ఎక్స్ పోర్ట్ చేసేందుకు హోండా కసరత్తు చేస్తోంది. ఇక.. ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీల చార్జింగ్ కోసం హోండా దేశవ్యాప్తంగా 6000 చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడానికి కసరత్తులు చేస్తోంది. నేషనల్ హైవేల మీద, ఇతర ముఖ్యమైన రోడ్ల మీద ఈ చార్జింగ్ స్టేషన్లను హోండా ఏర్పాటు చేయనుంది.
ముందుగా హోండా నుంచి యాక్టివాలో ఎలక్ట్రిక్ స్కూటర్ రానుంది. హోండా స్కూటీల్లో యాక్టివా ఎంత ఫేమస్ అయిందో తెలుసు కదా. అందుకే యాక్టివా నుంచే ఎలక్ట్రిక్ స్కూటర్ ను ముందుగా తీసుకొచ్చేందుకు హోండా కసరత్తులు చేస్తోంది. ఫిక్స్‌డ్ బ్యాటరీతో ఈ స్కూటీ రానుంది. ధర కూడా బడ్జెట్ ధరలోనే ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. యాక్టివా లాంచ్ తర్వాత మార్చే బ్యాటరీలతో ఇంకో ఎలక్ట్రిక్ వాహనం లాంచ్ కానుంది. నర్సాపుర మ్యానుఫ్యాక్షరింగ్ ప్లాంట్ లోనే 2030 నాటికి 10 లక్షల ఎలక్ట్రిక్ బైక్స్ ను తయారు చేసే లక్ష్యంతో ప్రస్తుతం హోండా ముందుకెళ్తోంది.