How 3D Advertisements Painted On Cricket Ground : మీరు ఎప్పుడైనా క్రికెట్ గ్రౌండ్ లో జరిగే మ్యాచ్ ను చూశారా? మీరు స్టేడియం వెళ్లి మ్యాచ్ ను చూడకపోయినా ఇంట్లో ఉండి టీవీలో అయినా చూస్తారు కదా. మీరు మ్యాచ్ చూసే సమయంలో ఈ విషయాలు గమనించారా? క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ అడుతున్న సమయంలో కనిపించే యాడ్స్ ను చూశారా? వాటిని చూసినప్పుడు బోర్డ్ గ్రౌండ్ లో నిలబెట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ.. స్టేడియంలో అలాంటి బోర్డులేవీ పెట్టరు. ఎందుకంటే అది మ్యాచ్ కాబట్టి ఆటగాళ్లు అటూ ఇటూ పరిగెత్తే సమయంలో అలాంటి బోర్డులు పెడితే వాటికి తాకి కింద పడతారు. మనకు అలా బోర్డులతో కనిపిస్తాయి కానీ.. అవి నిజంగా బోర్డులు కాదు. మరి ఏంటి అవి అని అంటారా? పదండి.. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
క్రికెట్ మ్యాచ్ అనగానే తమ బ్రాండ్స్ ను ప్రమోట్ చేసుకునేందుకు చాలా రకాల కంపెనీలు ప్రయత్నిస్తాయి. తమ వ్యాపారానికి బెస్ట్ అడ్వర్టైజ్ మెంట్ అంటే క్రికెట్ గ్రౌండ్ అనే చెప్పుకోవాలి. ఫీల్డ్ మీద పలు బ్రాండ్స్ పేర్లతో కనిపించే యాడ్స్ ను చూసే ఉంటారు కదా. కొందరు అవి పెయింట్ వేశారేమో అనుకుంటారు. మరికొందరు వాటి మీద బోర్డులు పెట్టారేమో అనుకుంటారు. కానీ.. అవి పెయింట్స్ కావు.. బోర్డులు కావు. అలా యాడ్స్ కోసం కొన్ని టెక్నిక్స్ వాడుతారు. అందులో ఒకటి త్రీడీ పెయింటింగ్. గ్రౌండ్ లో గడ్డిలా కనిపించే ప్లేస్ మీద త్రీడీ యాడ్స్ ను డిస్ ప్లే చేస్తారు.
How 3D Advertisements Painted On Cricket Ground : ఫ్యాబ్రిక్ తో గ్రౌండ్ లో పెయింట్ చేస్తారు?
ఒక్కోసారి త్రీడీ అడ్వర్టైజ్ మెంట్ కాకుండా.. ఫ్యాబ్రిక్ తో గ్రౌండ్ లో పెయింట్ చేస్తారు. అది కూడా కెమెరా యాంగిల్ కు పర్ ఫెక్ట్ గా సూట్ అవ్వాలి. అలా.. కొలతలు తీసుకొని గ్రౌండ్ మీద పెయింట్ వేస్తారు. మ్యాచ్ అయిపోగానే ఆ పెయింట్ ను వెంటనే తీసేస్తారు.
కానీ.. ఇప్పుడు టెక్నాలజీ మారింది. అంతర్జాతీయ మ్యాచ్ లలో రియల్ టైం ఎడిటింగ్ తో అడ్వర్టైజ్ మెంట్ డిస్ ప్లే చేస్తున్నారు. గ్రౌండ్ లో ఎలాంటి యాడ్స్ కనిపించవు. కేవలం టీవీలో చూస్తున్న వాళ్లకు మాత్రం ఏఐ ఆధారిత యాడ్స్ కనిపిస్తాయి. అసలు గ్రౌండ్ లో ఎలాంటి యాడ్స్ కనిపించనందున ప్లేయర్లకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు.