కరోనా అనేది ప్రపంచానికి పెనుభూతంలా మారి పెద్ద ఎత్తున ప్రజలను కష్టాలలోకి నెడుతోంది. కోవిడ్ దెబ్బకు అన్ని రంగాల వారు నష్టాలలోకి వెళ్లిపోయారు. అయితే మొదటి సారి కరోనా దెబ్బకు అన్ని రంగాల వారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సందర్భంలో మరల కరోనా సెకండ్ వేవ్ పేరుతో మరో సారి కోలుకోని దెబ్బ తగిలింది. దీంతో చేసేదేమి లేక చాలా మంది వ్యాపారులు తమ వ్యాపారాలను వదిలేసి చిన్న చిన్న పనులకు వెళ్లిపోయారు. ఎన్నో కుటుంబాలు ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న సంఘటనలు కోకొల్లలు. అయితే చిన్న చిన్న వ్యాపారులకు కరోనా వల్ల నష్టం జరిగినా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు మాత్రం ఏ విధమైన నష్టం జరగలేదు.

కరోనా వేళ మరింత పెరిగిన అదానీ ఆదాయం

ఇక బడా వ్యాపారవేత్తలంటే అందరికీ గుర్తుకొచ్చేది అంబానీ, అదానీలు. అయితే ఈ కరోనా సమయంలో పెట్రోల్ ధరల పెంపుపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. అయితే అంబానీ, అదానీలకు మాత్రమే లాభం జరుగుతున్నదని దేశం మొత్తం కోడై కూసిన విషయం తెలిసిందే. అయితే అదానీ లాంటి వ్యాపారవేత్తలకు గంట గంటకు కోట్లు సంపాదిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో అదానీ సంపాదన గంటకు 75 కోట్లుగా తెలుస్తోంది. అయితే చిన్న వ్యాపారులు నష్టపోవడానికి కారణం, అదానీ లాంటి వాళ్ళు లాభపడడానికి కారణం ప్రభుత్వ మద్దతు ఉన్నదని కొంత మంది వ్యాఖ్యానిస్తుండగా, అంటే ప్రజలు ఎక్కువగా వినియోగించే aన్తే పెట్రోల్ కానీ, విమానాశ్రయాలు కానీ ఇలా మరిన్ని వ్యాపారాలు అదానీ కలిగి ఉండడంతో కరోనా సమయంలోనూ ఈ సేవలు నిలిచిపోలేదు. ఈ సమయంలోనే అత్యంత అవసరంగా మారడంతో ఇంకా చాలా వరకు లాభాలు గడించాడని చెప్పవచ్చు. ఇంకా ఇది అధికారిక లాభాల ప్రకటన కానప్పటికీ అంతా ఊహాజనితమైన లెక్కలు అయినా ఇందులో వాస్తవం మాత్రం లేకపోలేదు. ఇంకా ఎన్ని నెలలు కరోనా కొనసాగినా అదానీ లాంటి వాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా వారు లాభాల బాట పడుతూ ఉంటారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 25, 2021 at 7:06 సా.