AP Village Volunteers : ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ప్రవేశ పెట్టని వ్యవస్థ.. ఏపీ గ్రామ వాలంటీర్ వ్యవస్థ. దాన్నే ఏపీ గ్రామ సచివాలయం అని కూడా పిలుస్తారు. ఈ వ్యవస్థ ద్వారా అన్ని ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి అర్హత కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలను అందించడం. ఈ పనిని గ్రామ వాలంటీర్ చేస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ప్రజల ఇంటి వద్దకే పాలన. ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడం కోసం రూపొందిందే విలేజ్ వాలంటీర్స్ సిస్టమ్.
ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఉంటుంది. ఆ గ్రామ సచివాలయం ద్వారా గ్రామంలోని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పిస్తారు. ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల మధ్య వాలంటీర్లను వారధిగా చేయడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక గ్రామంలో 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉండే వాలంటీర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డు ఇచ్చి వారికి నెలకు రూ.5000 భత్యం కూడా లభిస్తుంది.
AP Village Volunteers : ఎలా దరఖాస్తు చేసుకోవాలి
విలేజ్ వాలంటీర్లుగా చేరాలనుకునేవాళ్లు https://apgv.apcfss.in/ వెబ్ సైట్ కు లాగిన్ అయి అప్లయి చేసుకోవాలి. కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ఠ వయసు 35 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు దారు ఖచ్చితంగా పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు అయి ఉండాలి. అదే పంచాయతీకి చెందిన వారై ఉండాలి. ఓసీ కాకుండా వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్లు కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. గ్రామ, వార్డ్ వాలంటీర్ల పోస్టు కోసం ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ సచివాలయాల్లో పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తే అర్హత ఉన్నవాళ్లు అప్లయి చేసుకోవచ్చు.