Jagananna Amma Vodi Scheme : ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో లేవు. ఏపీ సీఎం వైఎస్ జగన్.. బడుగు, బలహీనవర్గాల కోసం పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే నవరత్నాలు, జగనన్న చేదోడు, అమ్మ ఒడి లాంటి పథకాలు ఉన్నాయి. అయితే.. చాలామందికి జగనన్న ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి చాలామందికి అవగాహన లేదు. అందుకే సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకం ఇది. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఉద్దేశించిన పథకం ఇది.
వాళ్లకు ఆర్థిక సాయం అందించడానికి ఏపీ ప్రభుత్వం ఈ అమ్మ ఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2019 సంవత్సరంలో ఈ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ప్రకారం.. రాష్ట్రంలో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్, ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లల తల్లి లేదా గార్డియన్స్ ఈ పథకం కింద అర్హులు అవుతారు.
Jagananna Amma Vodi Scheme : 12 వ తరగతి పూర్తయ్యే వరకు సంవత్సరానికి రూ.15 వేలు
ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి పూర్తయ్యే వరకు.. పిల్లల ఎంత మంది ఉన్నా ప్రతి బిడ్డకు సంవత్సరానికి రూ.15 వేలను ప్రభుత్వం విద్యార్థి తల్లి ఖాతాలో వేస్తుంది. నేరుగా లబ్దిదారుల ఖాతాలో జమ చేస్తారు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో ఈ పథకం కింద డబ్బులను అకౌంట్ లో వేస్తారు. ఈ పథకం కింద అర్హులు అయిన వారు ఏపీకి చెందిన వాసులు అయి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. బీపీఎల్ కుటుంబానికి చెందిన వారై ఉండాలి. ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి 12 వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే వాళ్లు అర్హులు. నిజానికి ఇది నవరత్నాలు పథకంలో ఒక భాగం. జగనన్న అమ్మ ఒడి పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి జగనన్న అమ్మ ఒడి వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు చేసుకొని తెల్ల రేషన్ కార్డు, ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా వివరాలు, విద్యార్థి, తల్లి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, నివాస గుర్తింపు కార్డు వివరాలు అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.