Jagananna Chedodu Scheme : ఏపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేవు. నవరత్నాల్లో భాగంగా ఏపీ సీఎం జగన్.. పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు. అందులో జగనన్న చేదోడు పథకం ఒకటి. ఈ పథకాన్ని కుల వృత్తులు చేసుకుంటూ జీవించే వారి కోసం తీసుకొచ్చారు. కుల వృత్తులు చేసుకుంటూ పొట్టను గడుపుకునే వారికి కోవిడ్ వల్ల సరైన పని దొరకక తీవ్ర ఇబ్బందులు పడటం చూసి వాళ్లను ఆదుకోవడం కోసం తీసుకొచ్చిన పథకం ఇది. కోవిడ్ కారణంగా చాలామంది కుల వృత్తులు చేసుకొని జీవించే వారు జీవనోపాధిని కోల్పోయారు. అందులో టైలర్స్ ఉన్నారు. చాకలి వాళ్లు, మంగలివాళ్లు(బార్బర్స్) ఉన్నారు. వీళ్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులతో ఆదుకునేందుకు తీసుకొచ్చిన సంక్షేమ పథకం ఇది.
ఈ పథకం కింద అర్హత పొందిన లబ్ధిదారులకు ఒకేసారి రూ.10 వేల సాయం అందిస్తారు. ఈ డబ్బులను తమ కుల వృత్తి పనుల కోసం, ఆదాయ వనరును పెంచుకోవడం కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ డబ్బు వాళ్లకు పెట్టుబడి అవసరాలను తీరుస్తుంది. ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు 60 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగి ఉండాలి.
Jagananna Chedodu Scheme : ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
21 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న వాళ్లు ఈ పథకానికి అర్హులు. అలాగే.. రజకులు, ధోబీలు, నాయి బ్రాహ్మణులు(మంగలి), టైలర్స్ మాత్రమే ఈ పథకానికి అర్హులు. టైలర్స్ అంటే.. బీసీ, ఈబీసీ వర్గానికి చెందిన వాళ్లే అయి ఉండాలి. వాళ్ల వృత్తి టైలర్ అయి ఉండాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం కింద లబ్ధిదారులను గ్రామ, వార్డు వాలంటీర్లు సర్వే నిర్వహిస్తారు. ఆ సర్వే ద్వారా లబ్దిదారుల గుర్తింపు జరుగుతుంది. నవశకం సర్వే అసలైన లబ్దిదారులు ఎవరో వాలంటీర్లు గుర్తిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి చేదోడు అప్లికేషన్ ఫామ్, ఆధార్ కార్డు, రైస్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంకు పాస్ బుక్, ఇన్ కమ్ సర్టిఫికెట్, షాప్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ తీసుకొని గ్రామ సచివాలయానికి వెళ్తే.. అక్కడ ఉండే సిబ్బంది.. ఈ పథకానికి అప్లయి చేస్తారు. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి అప్లయి చేసుకున్నా.. అన్నీ ఓకే అయితే.. లబ్దిదారుడి ఖాతాలో డబ్బులు వేస్తారు.