PM Fasal Bima Yojana : చాలామందికి ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన స్కీమ్ గురించి తెలియదు. నిజానికి అది రైతులు వేసే పంటలకు ఇచ్చే బీమా. అనుకోని కారణాల వల్ల కావచ్చు.. ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు.. రైతులు వేసిన పంటకు దిగుబడి రాకపోతే.. దానికి సంబంధించి నష్టపరిహారం పొందొచ్చు. దిగుబడి ఆధారిత పంటలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం కింద రైతులు దరఖాస్తు చేసుకుంటే పంటల బీమాను ఉచితంగా అనుసంధానం చేస్తారు.
అయితే.. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన పథకం కాదు.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం. కాబట్టి అన్ని రాష్ట్రాల వాళ్లు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో ప్రతి జిల్లాకు కొన్ని ఇన్సురెన్స్ కంపెనీలు రైతులకు బీమాను అందిస్తున్నాయి. అయితే.. వర్షాధార పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంటల బీమాను అందజేస్తోంది. ఒకవేళ వర్షాల వల్ల ఏదైనా నష్టం జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వమే బీమాను చెల్లిస్తోంది. కానీ.. వర్షాధార పంటలు కాకపోతే.. అనుకోని పరిస్థితుల్లో దిగుబడి రాక నష్టం వాటిల్లినప్డు పీఎం ఫసల్ బీమా యోజన పథకం కింద బీమాను పొందొచ్చు.
PM Fasal Bima Yojana : ఏపీలో జిల్లాల వారీగా ఇన్సురెన్స్ కంపెనీలు ఇవే
నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ, విశాఖపట్టణం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ఇఫ్కో టోక్యో జీఐసీ కంపెనీ, శ్రీకాకుళం, అన్నమయ్య, తూర్పు గోదావరి జిల్లాలకు హెచ్ఎఫ్ సీ ఎరో జీఐసీ కంపెనీ, నంద్యాల, పల్నాడు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎస్బీఐ జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ, కర్నూలు, వైఎస్సార్ కడప, విజయనగరం జిల్లాలకు ఎస్బీఐ, జనరల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్, కాకినాడ, పార్వతీపురం మన్యం జిల్లాలకు అగ్రికల్చర్ ఇన్సురెన్స్ కంపెనీ, అనంతపురం, ఏలూరు, గుంటూరు జిల్లాలకు రిలయెన్స్ జీఐసీ లిమిటెడ్, బాపట్ల, కోనసీమ జిల్లాలకు కూడా రిలయెన్స్ జీఐసీ లిమిటెడ్, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తిరుపతి జిల్లాలకు హెచ్డీఎఫ్సీ ఎర్గో కంపెనీలు ఇన్సురెన్స్ ను అందిస్తాయి. ఆయా జిల్లాల్లో రైతులు ఈ పథకం కింద దరఖాస్తు చేస్తూ సంబంధిత ఇన్సురెన్స్ కంపెనీలు మాత్రమే బీమాను చెల్లిస్తాయి. ఈ పథకం కింద అప్లయి చేసుకోవాలని అనుకునే రైతులు https://pmfby.gov.in/ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పంట నష్టం వాటిల్లినప్పుడు కూడా ఇదే వెబ్ సైట్ లో పంట నష్టం ఎలా జరిగింది. ఎంత జరిగిందో వివరాలు నమోదు చేస్తే.. సంబంధిత బీమా కంపెనీ వివరాలు వెరిఫై చేసుకొని బీమా మొత్తాన్ని రైతులకు అందజేస్తుంది.