PM Kisan Maan Dhan Yojana : సాధారణంగా రిటైర్ మెంట్ అనేది ఉద్యోగులకు ఉంటుంది. మరి.. రైతు సంగతి. రైతుకు రిటైర్ మెంట్ ఉండదా? ఉద్యోగులు రిటైర్ అయితే వాళ్లకు పింఛన్ వస్తుంది. మరి.. అదే రైతు రిటైర్ అయితే పింఛను ఎవరు ఇస్తారు.. ఎవ్వరూ ఇవ్వరు. అసలు.. పంట పండించే సమయంలోనే రైతుకు ఎవ్వరూ ఆసరా ఉండరు. రైతు రిటైర్ అయ్యాక ఎవరు పింఛన్ ఇస్తారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం.. రైతుల కోసం అది కూడా 60 ఏళ్ల వయసు దాటిన రైతులకు పింఛన్ ఇచ్చేలా ఒక పథకాన్ని తీసుకొచ్చింది. దాన్నే ప్రధాన మంత్రి మాన్ ధన్ యోజన పథకం అంటారు. షార్ట్ గా పీఎం కేఎంవై అంటారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు 60 ఏళ్లు పైబడిన తర్వాత ప్రతి నెలా పింఛన్ ను అందిస్తారు. రైతు చనిపోయే వరకు ఆ పింఛన్ ను చెల్లిస్తూనే ఉంటారు.
ఈ పథకం కోసం కేంద్రం ఎల్ఐసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతు నెలకు కనీసం రూ.55 నుంచి ప్రీమియం చెల్లించవచ్చు. రైతు ఎంతైతే ప్రీమియం చెల్లిస్తాడో.. అంతే డబ్బు కేంద్రం కూడా ఆ రైతు పేరు మీద చెల్లిస్తుంది. 60 ఏళ్ల నుంచి రైతుకు నెలకు రూ.5 వేల వరకు పింఛన్ అందిస్తుంది. ప్రీమియంను ఆన్ లైన్ లో లేదంటే మీ సేవలో చెల్లించుకోవచ్చు.
PM Kisan Maan Dhan Yojana : దరఖాస్తు ఎలా చేయాలి?
ఆన్ లైన్ లో కేంద్రం కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్సీ) వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. లేదంటే రైతులు పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పాస్ బుక్, భూమి పట్టాదార్ పాస్ బుక్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్స్ ను తీసుకొని ఈసేవకు వెళ్లి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.55 నుంచి రూ.200 వరకు ప్రీమియంను రైతు నెలనెలా చెల్లించుకోవచ్చు. అయితే.. ఈ పథకానికి వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులే అర్హులు. అంటే 5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులు ఈ పథకం కింద అర్హులు అవుతారు. ఉద్యోగాలు చేసే వారు, నేషనల్ పెన్షన్ స్కీమ్ కింద చేరిన వారు, ఆదాయపు పన్ను కట్టేవాళ్లు ఈ స్కీమ్ కింద అనర్హులు అవుతారు. ఒకవేళ 60 ఏళ్ల రాకముందే రైతు మరణిస్తే.. రైతు నామినీకి ఆ పింఛన్ ను అందిస్తారు.