YSR Law Nestham : మీరు లా చదివారా? మీది ఏపీనా? అయితే మీకో శుభవార్త. ఏపీలో లా చేసిన వాళ్లకు, జూనియర్ లాయర్లకు నెలకు రూ.5000 స్టైఫండ్ లభిస్తుంది. అవును.. జూనియర్ లాయర్లను ఆదుకునేందుకు రూ.5000 ఆర్థిక సాయం అందించడానికి ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు లా పాస్ అయి ఉండాలి. ఏపీ పౌరులు అయి ఉండాలి.
జూనియర్ అడ్వకేట్లతో పాటు లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్లకు మొదటి మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసే సమయంలో స్టైఫండ్ గా రూ.5000 ఇస్తారు. మరి.. ఈ పథకం కింద ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పథకాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ డిసెంబర్ 2019 లో ప్రారంభించారు.
YSR Law Nestham : 35 ఏళ్ల వయసును మించకూడదు
ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు లా పాస్ అయి ఉండాలి. లా ప్రాక్టీస్ చేసే వాళ్లు అయినా అర్హులే. కానీ.. మొదటి మూడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేసే వాళ్లే అర్హులు. న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చదివి ఉండాలి. 35 ఏళ్ల వయసు మించి ఉండకూడదు. 2016 సంవత్సరం నుంచి లా పాస్ అయిన వాళ్లే ఈ పథకానికి అర్హులు. కారు లాంటి నాలుగు చక్రాల వాహనాలు కలిగి ఉన్నవాళ్లు అర్హులు కారు. న్యాయవాదుల చట్టం, 1961, సెక్షన్ 17 ప్రకారం ఏపీ బార్ కౌన్సిల్ నిర్వహించే లా రోల్స్ లో దరఖాస్తు చేసుకోవాలి. https://myap.e-pragati.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ పథకం కోసం న్యాయవాదులు దరఖాస్తు చేసుకోవచ్చు. తమ లా పట్టా వివరాలు అన్నీ సమర్పించి ఇందులో అప్లయి చేసుకుంటే అర్హులైన వారికి నెలకు రూ.5000 ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం గురించి మరిన్ని వివరాలు కావాలంటే గ్రామ వాలంటీర్ ను కూడా వివరాలు అడిగి కనుక్కోవచ్చు.