YSR Nethanna Nestham Scheme : ఏపీలో చేనేత కార్మికులను ఆదుకోవడానికి తీసుకొచ్చిందే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం. చేనేత కార్మికులకు ఆర్థిక సాయం చేసి వారు చేనేత పనులు చేసుకునేలా చేయందించడం కోసం రూపొందిందే ఈ పథకం. ఈ పథకం కింద అర్హులు అయిన చేనేత కార్మికులకు బ్యాంకు ఖాతాలో నేరుగా సంవత్సరానికి రూ.24 వేలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది.
అలా.. ఐదేళ్ల పాటు సంవత్సరానికి రూ.24 వేలను అంటే.. రూ.1.2 లక్షలను చేనేత కార్మికుల ఖాతాలో జమచేస్తారు. అయితే.. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలంటే.. నేతన్నలకు సొంతంగా మగ్గాలు ఉండాలి. మగ్గం పని చేస్తూ ఉండాలి. అటువంటి వాళ్లు మాత్రమే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి అర్హులు.
YSR Nethanna Nestham Scheme : దారిద్ర్య రేఖను దిగువన ఉండాలి
ఈ పథకం కింద అప్లయి చేసుకునే వాళ్లు ఆంధ్ర ప్రదేశ్ లో శాశ్వత నివాసి అయి ఉండాలి. వృత్తి రిత్యా చేనేత కార్మికుడు అయి ఉండాలి. అలాగే.. దరఖాస్తు దారుడు హాండ్ లూమ్ అసోసియేషన్ తో అనుబంధం కలిగి ఉండాలి. లేదంటే ముందు హాండ్ లూమ్ అసోసియేషన్ లో నమోదు చేసుకోవాలి. అలాగే.. దారిద్ర్య రేఖకు దిగువన ఉండాలి. ఒక కుటుంబంలో ఎన్ని మగ్గాలు ఉన్నా.. ఒక నేత కుటుంబానికి సాయం అందిస్తారు.
ఇక.. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని అనుకునే వాళ్లు.. https://aphandtex.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అయితే.. దరఖాస్తుకు ముందు ఆదాయ ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ అడ్రస్, బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు పై డాక్యుమెంట్స్ అన్ని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే.. ఈ పథకం గురించి మరిన్ని వివరాలను గ్రామ వాలంటీర్ ను అడిగి కూడా తెలుసుకోవచ్చు. ఈ పథకం కింద అప్లయి చేసుకోవడానికి వాళ్లు సాయం చేస్తారు.