YSR Vahana Mitra : ఏపీలో సీఎం జగన్ పేద, బలహీన వర్గాల కోసం పలు ప్రభుత్వ పథకాలను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో నవరత్నాలు పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు. అందులో భాగంగానే వైఎస్సార్ వాహన మిత్ర అనే స్కీమ్ ను వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ స్కీమ్ లో భాగంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేల సాయాన్ని అందించనున్నారు.
కేవలం ఆటో డ్రైవర్లు మాత్రమే కాదు.. ట్యాక్సీ డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఈ సాయాన్ని వాహనాల నిర్వహణ ఖర్చుల కోసం, బీమా, ఫిట్ నెస్ సర్టిఫికెట్లు పొందడం కోసం ఉపయోగించుకోవచ్చు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లు దరఖాస్తు చేసుకుంటే వాళ్లకు సంవత్సరానికి రూ.10 వేల సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
YSR Vahana Mitra : 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న ఆటో, క్యబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హులు
క్యాబ్, ఆటో డ్రైవర్లు 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉండాలి. ఏపీలో శాశ్వత నివాసి అయి ఉండాలి. క్యాబ్, ఆటో నడుపుతూ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఉండాలి. అలాగే.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వర్గానికి చెందిన వ్యక్తి అయి ఉండాలి. వాళ్లు ఖచ్చితంగా ఆటో, టాక్సీ, క్యాబ్ నడుపుతూ ఉంటే.. ఈ పథకానికి అప్లయి చేసుకోవచ్చు.
ఇప్పటి వరకు ఈ పథకం కింద రూ.1025 కోట్లను ప్రభుత్వం ఖర్చు పెట్టింది. గత 4 ఏళ్ల నుంచి 40 వేల మంది లబ్ధిదారులకు సంవత్సరానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అనుకునేవాళ్లు https://www.aptransport.org/ ఈ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. లేదంటే గ్రామ వాలంటీర్ ను వివరాలు అడిగితే ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరాలు చెబుతారు.