Mahindra XUV 400 : మహీంద్రా ఎక్స్ యూవీ కార్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఎలక్ట్రిక్ వేరియంట్ లో వచ్చిన మహీంద్రా ఎక్స్ యూవీ 400 కారు యూత్ కు బాగా నచ్చింది. అందులోనూ అది ఎలక్ట్రిక్ కారు కావడంతో ఆ కారు ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగింది. మహీంద్రా నుంచి వచ్చిన ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఇది. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ లో ఇదే తొలి ఎస్ యూవీ కావడంతో జనాలకు ఈ కారు బాగా నచ్చేస్తోంది. కేవలం ఎస్ యూవీ కారు మాత్రమే కాదు.. దీని ఫీచర్స్ కూడా అదుర్స్ అనే చెప్పుకోవాలి. అందుకే జనాలు ఈ కారు వెంట పడుతున్నారు. అందులోనూ పలు ఈఎంఐ ఆప్షన్ ను కూడా ఈ కారు అందిస్తోంది. కేవలం డౌన్ పేమెంట్ గా లక్షా 70 వేలు చెల్లిస్తే చాలు.. ఈ కారును సొంతం చేసుకోవచ్చు.
39.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చే ఈ కారు సింగిల్ చార్జ్ తో 456 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాటా నుంచి వస్తున్న నెక్సాన్ ఈవీ కారు ప్రస్తుతం టాప్ లో ఉంది. ఆ కారును ఢీకొట్టేందుకే మహీంద్రా నుంచి ఈ కారును విడుదల చేశారు. ఒకవేళ మీరు ఎక్స్ యూవీ 400 కారును తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ కారు మూడు వేరియంట్స్ లో రానుంది.
Mahindra XUV 400 : ఈసీ వేరియంట్ కారు ధర రూ.16.83 లక్షలు
ఈసీ వేరియంట్ కారు ధర రూ.16.73 లక్షలు కాగా.. కేవలం రూ.1.70 లక్షలు డౌన్ పేమెంట్ కడితే చాలు.. కారును సొంతం చేసుకోవచ్చు. 5 ఏళ్ల పాటు నెలకు రూ.32,148 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. అదే ఈసీ ఫాస్ట్ చార్జర్ కారు అయితే రూ.17.35 లక్షలు ఉంది. దీన్ని రూ.1.74 లక్షలు డౌన్ పేమెంట్ కట్టి సొంతం చేసుకోవచ్చు. 5 ఏళ్ల పాటు నెలకు రూ.33,174 ఈఎంఐ చెల్లిస్తే చాలు. అదే.. ఈఎల్ ఫాస్ట్ చార్జర్ వేరియంట్ కారు అయితే.. రూ.2 లక్షలు డౌన్ పేమెంట్ కడితే చాలు. దీని కోసం నెలకు రూ.38,176 ఈఎంఐ ఐదేళ్ల పాటు కట్టాల్సి ఉంటుంది. కారు మొత్తం ధరలో 10 శాతం డౌన్ పేమెంట్ కడితే కారును సొంతం చేసుకోవచ్చన్నమాట. 5 ఏళ్లకు 10 శాతం బ్యాంక్ వడ్డీతో పాటు చెల్లించాల్సి ఉంటుంది.