Best Second Hand Car : చాలామంది మధ్యతరగతి ప్రజలు.. కొత్త కారు కంటే కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనాలానే అనుకుంటారు. తక్కువ బడ్జెట్ లో కారు వస్తుంది కదా అని ఆలోచించి సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకుంటారు. ఈ మధ్య కార్ల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ కారుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు జనాలు. కొత్త కారు అంటే షోరూమ్ లోకి వెళ్లి నచ్చింది సెలెక్ట్ చేసుకొని డబ్బులు కట్టి తెచ్చుకోవచ్చు. కానీ.. సెకండ్ హ్యాండ్ కారు అనేసరికి చాలామంది మదిలో చాలా ప్రశ్నలు పుట్టుకొస్తాయి.
సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవాలంటే.. దాంట్లో ఏం చూడాలి. ఎలా దాన్ని నమ్మి తీసుకోవాలి.. అంటే ముందు కారు కండిషన్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఒకవేళ కారు గురించి అవగాహన ఉంటే మీరే కారును చెక్ చేసుకోవచ్చు. లేదంటే కారు గురించి అవగాహన ఉన్నవారిని లేదా మెకానిక్ ను తీసుకొని పరీక్షించవచ్చు. కారు అంతా ఓకే అనిపిస్తే అప్పుడు ఒక అడుగు ముందుకు వేయాలి.
Best Second Hand Car : టెస్ట్ డ్రైవ్ కంపల్సరీ
కారును ప్రతి యాంగిల్ లో చెక్ చేసుకోవాలి. అంటే.. టైర్ల దగ్గర్నుంచి.. కారుకు వేసిన పెయింట్ కూడా చెక్ చేసుకుంటే బెటర్. సీట్లు, మ్యూజిక్ సిస్టమ్ ఇలా అన్ని ముందే చెక్ చేసుకుంటే బెటర్. అన్నీ ఓకే అనుకుంటే అప్పుడు టెస్ట్ డ్రైవ్ కు వెళ్లాలి. ఎందుకంటే.. టెస్ట్ డ్రైవ్ లోనే ఆ కారుకు ఉన్న సమస్యలు ఏంటో తెలుస్తాయి.
టెస్ట్ డ్రైవ్ చేయకుండా కారును అస్సలు కొనకండి. కారు మెయిన్ టెనెన్స్ రికార్డులను కూడా పరిశీలించాలి. కారుకు సంబంధించిన రిపేర్స్, పార్ట్స్ గురించి అందులో వివరంగా రాస్తారు. ఆ తర్వాత వాహనం ఆర్సీని సరిగ్గా చెక్ చేసుకోవాలి. దానిపై ఓనర్ పేరు ఉందా.. కారు ఇంజిన్ వివరాలు.. అన్నీ చెక్ చేసుకొని ఆర్సీతో పాటు ఇన్సురెన్స్, రోడ్ టాక్స్, కారు కొన్నప్పటి ఇన్ వాయిస్, ఎన్వోసీ అన్నీ ఓకే అనుకున్నాక అప్పుడు కారు కొనేందుకు ముందడుగు వేసి బేరం ఆడండి.