How To Download Voter ID Card Online : ఇది ఎన్నికల సమయం. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఓటర్ ఐడీ ఉండాలి. ఓటర్ ఐడీ లేకున్నా ఆధార్ కార్డును ప్రూఫ్ గా చూపించి అయినా ఓటేయొచ్చు కానీ.. ఓటర్ ఐడీ కూడా దగ్గర ఉంచుకోవడం మంచిది. ఓటర్ ఐడీ కార్డు ఉంది అంటే ఓటరు లిస్టులో మీ పేరు ఉన్నట్టే. ఓటరు లిస్టులో పేరు చెక్ చేసుకోవడం కోసం అయినా ఓటర్ ఐడీ కార్డును దగ్గర ఉంచుకోవాలి.
అయితే.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం చాలామంది ఓటర్ ఐడీ కార్డును తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ.. చాలామందికి ఓటర్ ఐడీ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో తెలియదు. ఓటర్ ఐడీ కార్డునే ఎపిక్ కార్డు అని కూడా అంటారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
How To Download Voter ID Card Online : ఆన్ లైన్ లో ఈ ఓటర్ ఐడీ కార్డు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
దాని కోసం మీరు https://voters.eci.gov.in/ అనే వెబ్ సైట్ కి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఎన్నికల సంఘం అధికారిక వెబ్ సైట్. ఈ వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత కుడి వైపు హోమ్ పేజీలో ఈ ఎపిక్ డౌన్ లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద గెట్ డిజిటల్ వర్షన్ ఆఫ్ యువర్ ఎలక్టోరల్ ఫోటో ఐడెంటిటీ కార్డు అని రాసి ఉంటుంది. అంటే డిజిటల్ వర్షన్ కార్డును మీరు డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
దాని మీద క్లిక్ చేస్తే లాగిన్ అవ్వాలని చెబుతుంది. దానికంటే ముందు మీరు ఈ వెబ్ సైట్ లో మీ వివరాలు ఇచ్చి సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ దగ్గర మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, పాస్ వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే రిక్వెస్ట్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ ను క్లిక్ చేస్తే మీకు ఓటీపీ ఎంటర్ చేయాలని చెబుతుంది. ఆ తర్వాత మీ ఈ ఎపిక్ కార్డు అక్కడ కనిపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. దాన్ని తీసుకెళ్లి ఎన్నికల అధికారులకు చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.