How To Pay HMWSSB Water Bill Payment Online : హైదరాబాద్ నగరంలో, చుట్టు పక్కన ప్రాంతాల్లో ఉండే వాళ్లు వాటర్ బిల్ ప్రతి నెల పే చేస్తుంటారు. మంజీరా, కృష్ణా వాటర్ నగరంలో మున్సిపల్ సిబ్బంది సరఫరా చేస్తుంటుంది. అయితే.. వాటర్ బిల్ కట్టడం కోసం ప్రతి సారి మున్సిపల్ ఆఫీసుకు వెళ్లాల్సిందేనా? ఆన్ లైన్ లో వాటర్ బిల్ కట్టుకోలేమా? అంటే.. వాటర్ బిల్ కోసం పెద్ద పెద్ద క్యూలో గంటలకు గంటలు నిలబడాలా? అంటే అవసరం లేదు. ప్రతి నెల డ్యూ డేట్ ను గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే.. హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ వాళ్లు వాటర్ బిల్ పేమెంట్ ను మరింత ఈజీ చేశారు. నగర వాసుల కోసం ఆన్ లైన్ ప్రాసెస్ ను తీసుకొచ్చింది బోర్డు.
హైదరాబాద్ కు చెందిన వాళ్లు వాటర్ బిల్స్ పే చేయాలని అనుకుంటే.. ఆన్ లైన్ లో చేయొచ్చు. దాని కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయి అండ్ సీవరేజ్ బోర్డ్ పోర్టల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఆన్ లైన్ ఆప్షన్ ద్వారా పే చేయొచ్చు.
How To Pay HMWSSB Water Bill Payment Online : అఫిషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి ఇలా చేయండి
https://www.hyderabadwater.gov.in/ అనే అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అందులో సర్వీసెస్ ట్యాబ్ లోకి వెళ్లాలి. అక్కడ Customer Services లో Pay Your Bill Online అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. అక్కడ రెండు లింకులు కనిపిస్తాయి. ఒకటి Bill Desk ఇంకొకటి.. Official Govt Wallet అనే ఆప్షన్ ఉంటుంది.
అఫిషియల్ గౌట్ వాలెట్ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకుంటే వాటర్ బిల్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ సీఏఎన్ నెంబర్ ను ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఫర్ బిల్ అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి.
అక్కడ మీకు వాటర్ బిల్ వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ అయ్యాక దాని రిసీప్ట్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. లేదంటే అమెజాన్ యాప్ లోనూ వాటర్ బిల్స్ పే చేసుకోవచ్చు. పేరూప్ యాప్, టాక్ చార్జ్ యాప్ లాంటి యాప్స్ లోనూ మీరు వాటర్ బిల్ పే చేసుకోవచ్చు.