Bike Protection : చాలామంది బైక్ ల గురించి టెన్షన్ పడుతుంటారు. బైక్ ను ఎక్కడైనా పార్క్ చేసినా.. రోడ్డు మీద ఎక్కడైనా పెట్టినా ఎవరైనా ఎత్తుకుపోతే ఎలా అని టెన్షన్ పడుతుంటారు. హ్యాండిల్ లాక్ వేసినా కూడా బైక్ ను దొంగలు ఈజీగా దొంగలించగలరు. బైక్ కీ లేకున్నా బైక్ ను స్టార్ట్ చేసి వేసుకెళ్లగలరు. దొంగల బారి నుంచి బైక్ ను కాపాడటం చాలా వరకు కష్టమే. ముఖ్యంగా ఇంటి ముందు రాత్రి పూట పార్క్ చేసినా ఎప్పుడు ఏ దొంగ వచ్చి బైక్ ను ఎత్తుకుపోతాడో అని టెన్షన్ పడుతుంటాం.
కానీ.. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. లేటెస్ట్ బైక్స్ మీదగ్గర ఉంటే బైక్ ను దొంగల బారి నుంచి తప్పించవచ్చు. ఈ పని చేస్తే మీ బైక్ ను ఎవ్వరూ ఎత్తుకెళ్లరు. దానికి మీరు ఒక పని చేయాలి. బైక్ లో యాంటీ థెఫ్ట్ అలారంను ఇన్ స్టాల్ చేసుకోవాలి. యాంటీ థెప్ట్ అలారం ఉంటే మీ బైక్ ను ఎవ్వరూ ముట్టుకోరు.
Bike Protection : అలారం ఆటోమొబైల్ షాపులలో దొరుకుతుంది
యాంటీ థెప్ట్ అలారాన్ని ఆటోమొబైల్ షాపులలో కొనుక్కోవచ్చు. యాంటీ థెప్ట్ అలారం ఉంటే.. ఎవరైనా మీ బైక్ ను ముట్టుకున్నా.. ఇంకేదైనా చేసినా వెంటనే అలారం మోగుతుంది. దాని వల్ల బైక్ ను దొంగల బారి నుంచి తప్పించవచ్చు. కిల్ స్విచ్ అనే ఇంకో పరికరాన్ని ఇన్ స్టాల్ చేసుకుంటే దాని వల్ల స్పార్క్ ప్లగ్ కు కరెంట్ పాస్ కాదు. దాని వల్ల ఇంజన్ స్టార్ట్ కాదు.
అలాగే.. హ్యాండిల్ లాక్స్, డిస్క్ బ్రేక్ లాక్స్, ఇగ్నీషన్ లాక్స్ లాంటి వివిధ రకాల లాక్స్ ను వినియోగిస్తే బైక్ ను ఎవ్వరూ ఎత్తుకెళ్లే అవకాశం ఉండదు. మీరు బైక్ ను ఎక్కడ పార్క్ చేసినా ఎలాంటి టెన్షన్ ఉండదు.