Best Electric Car : కొత్తగా కారు తీసుకోవాలని అనుకుంటున్నారా? అది కూడా ఈవీకి ప్లాన్ చేస్తున్నారా? పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అంటే బోలెడు వాహనాలు ఉన్నాయి కానీ.. ఎలక్ట్రిక్ కారు అనే సరికి చాలామందికి తెలియదు. ఏ కారు తీసుకోవాలి. ఈవీలో ఎలాంటి ఫీచర్లు ఉంటాయి.. అనేది చాలామందికి తెలియదు. కొత్తగా కారు తీసుకోవాలని అనుకున్నవాళ్ల కోసమే ఈ కథనం.
పెట్రోల్, డీజిల్ రేట్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో అందరూ ఇక ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలు రాజ్యమేలుతున్నాయి. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చాయి. ఇంకా భవిష్యత్తులో మరిన్ని ఈవీలు రోడ్ల మీదికి రానున్నాయి. కానీ.. అసలు ఏ ఈవీ తీసుకోవాలి అంటే ఈవీ అనగానే ముందు మనం చూసుకునేది చార్జింగ్ ఫెసిలిటీ.
Best Electric Car : ఈవీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలి?
ఈవీ అనగానే చార్జింగ్ ఫెసిలిటీ గురించి ఆలోచించాలి. కారు చార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. చార్జింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసుకోవాలి. బయటికెళ్లినప్పుడు చార్జింగ్ ఫెసిలిటీ ఉంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఆ తర్వాత ఈవీ రేంజ్ తెలుసుకోవాలి. చార్జింగ్ రేంజ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ మైలేజీ వస్తుంది. తక్కువ ఈవీ రేంజ్ ఉంటే తక్కువ మైలేజీ వస్తుంది. సిటీల్లో ఉండేవారు అయితే తక్కువ రేంజ్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ.. దూర ప్రయాణాలు చేసేవాళ్లు రేంజ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే.. ఈవీల్లో ఎస్‌యూవీని సెలెక్ట్ చేసుకోవాలి. సెడాన్, హ్యాచ్ బ్యాక్ కంటే కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాలని అనుకునే వాళ్లు ఎస్‌యూవీలను ఎంచుకోవాలి. ఏ కంపెనీ అయినా ఈవీలో బేసిక్ మోడల్ కారు ధర కనీసం రూ.8 లక్షలు ఉంటుంది. ఈ మధ్య అన్ని బ్రాండ్స్ ఈవీని తీసుకొస్తున్నాయి. త్వరలో భారత్ మార్కెట్ ను ఈవీ వాహనాలు శాసించే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.