Hyundai Grand i10 Nios 2023 : ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ గురించి తెలుసు కదా. హ్యుందాయ్ కార్లు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కనిపిస్తాయి. హ్యుందాయ్ కంపెనీ బడ్జెట్ కార్ల నుంచి హైఎండ్ కార్లను కూడా తయారు చేస్తుంది. అయితే.. మధ్యతరగతి ప్రజల కోసం అత్యాధునికమైన ఫీచర్లతో హ్యుందాయ్.. కొన్నేళ్ల క్రితమే గ్రాండ్ ఐ10 అనే కారును లాంచ్ చేసింది. అందులో చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఆ కారు భారత్ లో బాగా క్లిక్ అయింది. దీంతో దానికి మరికొన్ని ఫీచర్స్ ను యాడ్ చేసి 2023 కొత్త ఎడిషన్ ను లాంచ్ చేసింది హ్యుందాయ్. గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ లో 2023 ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.5.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
1.2 పెట్రోల్ ఎరా ఎంటీ బేస్ కారు ధర రూ.5.69 లక్షలు. అదే టాప్ మోడల్ కారు ధర రూ.8.47 లక్షలుగా ఉంది. అది 1.2 పెట్రోల్ అస్టా ఏఎంటీ బేస్ ను కలిగి ఉంటుంది. ఈ కారులో క్లాస్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయని.. ఇంటీరియర్ కూడా అద్భుతం అని భారత యూత్ కు అద్భుతమైన సీటింగ్ ఎక్స్ పీరియెన్స్ కోసం ప్రత్యేకంగా ఈ కారును డిజైన్ చేసినట్టు కంపెనీ తెలిపింది.
Hyundai Grand i10 Nios 2023 : పాత మోడల్ కు రీడిజైన్ వెర్షనే ఇది
పాత మోడల్ కు రీడిజైన్ చేసి పలు కొత్త ఫీచర్లను ఈ కారులో యాడ్ చేశారు. 15 ఇంచ్ డైమాండ్ కట్ అల్లీ వీల్స్, టెయిల్ లాంప్ కస్టర్, స్పార్క్ గ్రీన్ బ్లాక్ రూఫ్, పోలార్ వైట్, బ్లాక్ రూఫ్, ఫుట్ వెల్ లైటింగ్, వైర్ లెస్ స్మార్ట్ ఫోన్ చార్జర్, యూఎస్బీ టైప్ సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్, ఆటోమెటిక్ ఎయిర్ కాన్, ‘ ఇంచ్ టచ్ స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పుష్ బటన్ స్టార్ట్, స్టాప్, క్రూజ్ కంట్రోల్, 4 ఎయిర్ బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటోమెటిక్ హెడ్ లాంప్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్(ఈఎస్సీ), వెహికిల్ స్టెబిలిటీ మేనేజ్ మెంట్(వీఎస్ఎం), హిల్ హోల్డ్ అసిస్ట్, ఐఎస్వో ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్ పాయింట్స్ 1.2 లీటర్ పెట్రోల్ మోటర్, 83 బీహెచ్పీ, 114 ఎన్ఎం, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఏఎంటీ, సీఎన్జీ వేరియంట్ ఇంజన్, 69 బీహెచ్పీ, 95.2 ఎన్ఎం లాంటి ఫీచర్లతో ఈ కారు భారత్ లో లాంచ్ అయింది.