India’s Most Expensive Car : సాధారణంగా ఒక కారు ధర ఎంతుంటుంది చెప్పండి. మా అంటే.. ఒక 10 లక్షలు.. 20 లక్షలు. 30 లక్షలు పెడితే లగ్జరీ కారును సొంతం చేసుకోవచ్చు. కానీ.. కోట్లలో ధర ఉండే కార్లు కూడా ఉంటాయి తెలుసా? చాలామంది సెలబ్రిటీలు వాడేది అలాంటి కార్లే. కోట్లు పెట్టి మరీ కార్లు కొనుక్కుంటారు ధనవంతులు. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు, సినిమా, రాజకీయ సెలబ్రిటీలు అలాంటి పెద్ద కార్లే వాడుతుంటారు. తాజాగా టయోటా కంపెనీ నుంచి భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును తాజాగా లాంచ్ చేశారు.
ఆ కారు పేరు టయోటా లాండ్ క్రూజర్ ఎస్యూవీ. దీన్ని ఇటీవల ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించారు. ఈ కారు బుకింగ్స్ గత సంవత్సరమే ప్రారంభం అయ్యాయి. మహారాష్ట్రలోని మధుబన్ టయోటా అనే కార్ల షోరూమ్ ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వివరాలను ఆన్ లైన్ లో విడుదల చేసింది. ఈ కారును బుక్ చేసుకున్న తొలి కస్టమర్ కు ఆ కారును తాజాగా అందజేసింది. బ్రాండ్ న్యూ లాండ్ క్రూజర్ ఎల్సీ 300 కారును కస్టమర్ కు అందించింది. ఆ కారు ధర అక్షరాలా రూ.2 కోట్లు.
India’s Most Expensive Car : ఆ కారును దక్కించుకున్న కొల్హాపూర్ కు చెందిన వ్యక్తి
ఆ కారును మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన ప్రతీక్ జాదవ్ బుక్ చేసుకున్నారు. మొత్తం డబ్బులు పే చేసిన తర్వాత ఆ కారును షోరూమ్ ద్వారా అందుకున్నాడు. ఇండియాలో ఇదే తొలి లాండ్ క్రూజర్ ఎల్సీ 300 ఎస్యూవీ కారు. ఈ కారు.. ఐదు కలర్స్ లో లభిస్తుంది. ఆల్ ఎల్ఈడీ హెడ్ లాంప్స్, 12.3 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటేన్ మెంట్ సిస్టమ్, లెథర్ అప్ హోల్ స్టెరీ, 14 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టమ్, జీఏ ఎఫ్ ప్లాట్ ఫామ్, కైనెటిక్ డైనమిక్ సస్పెన్షన్, 3.5 లీటర్ ట్విన్ టర్బో చార్జింగ్ ఇంజిన్, 415 పీఎస్, 650 ఎన్ ఎం పీక్ టార్క్, 3.3 లీటర్ వీ6 టర్బో డీజిల్ ఇంజన్, 309 పీఎస్, 700 ఎన్ఎం పీక్ టార్క్, 10 స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ లాంటి ఫీచర్లతో ఈ కారును లాంచ్ చేశారు.