MS Dhoni – Sakshi Love Story : ఎంఎస్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేంద్ర సింగ్ ధోనీ ఒక లెజండ్ క్రికెటర్. ఆయన భారత క్రికెట్ రంగానికి చేసిన సేవలు ఎవ్వరూ మరిచిపోలేరు. భారత్ కు ప్రపంచ కప్ లను అందించిన ఘనత ధోనికే దక్కుతుంది. ఆయన్ను అందరూ మిస్టర్ కూల్ గా పిలుస్తుంటారు. 16 ఏళ్ల పాటు టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న ధోనీ పెళ్లి విషయంలో మాత్రం చాలా వార్తలు వస్తుంటాయి. ఆయనది ప్రేమ వివాహం అని అందరికీ తెలిసిందే. అయితే.. ఆయన ప్రేమ పెళ్లి కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చిందట. ఆయన పెళ్లి విషయంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ ఎదుర్కొని తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లాడారు ధోనీ.
నిజానికి ధోనీ భార్య సాక్షి ఎవరో కాదు. తన చిన్ననాటి ఫ్రెండే. ఎంఎస్ ధోనీ సినిమాలో చూసినట్టుగా ఇద్దరికీ హోటల్ లో మాత్రమే పరిచయం ఏర్పడలేదు. ఇద్దరికీ ముందే పరిచయం ఉంది. ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. వాళ్ల రెండు ఫ్యామిలీలు స్నేహంగా ఉండేవి. ఇద్దరూ ఒకే స్కూల్ లో చదువుకున్నారు. కానీ.. కొంత కాలం తర్వాత సాక్షి కుటుంబం డెహ్రాడూన్ లో స్థిరపడింది. ఆ తర్వాత ఇరు ఫ్యామిలీలు ఎప్పుడూ కలవలేదు. కట్ చేస్తే ధోనీ క్రికెటర్ అయ్యాక కోల్ కతాలోని తాజ్ బెంగాల్ హోటల్ లో ధోనీ స్టే చేస్తున్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లాడు ధోనీ. ఆ హోటల్ లో సాక్షి పని చేస్తుంది. అక్కడే తొలిసారి సాక్షిని చూసి ప్రేమలో పడిపోయాడు ధోనీ.
MS Dhoni – Sakshi Love Story : ఫోన్ నెంబర్ తీసుకొని వెంటనే మెసేజ్ చేసిన ధోనీ
తొలి చూపులోనే ధోనీకి సాక్షి నచ్చేసింది. దీంతో తన మేనేజర్ ద్వారా ఆమె నెంబర్ ను తెలుసుకున్న ధోనీ వెంటనే ఆమెకు మెసేజ్ చేశాడు. ధోనీ నుంచి మెసేజ్ అనగానే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ.. సాక్షి మాత్రం అతడు చేసే మెసేజ్ లను పట్టించుకోలేదు. ఆ తర్వాత మెల్లగా అతడితో చాట్ చేయడం మొదలు పెట్టింది ధోనీ. రెండు నెలల తర్వాత ధోనీ పుట్టిన రోజు వేడుకలకు సాక్షి వెళ్లింది. అప్పుడే తనను బైక్ పై తన ఇంటి దగ్గర దింపేందుకు వెళ్లినప్పుడు తనకు ప్రపోజ్ చేశాడు. అప్పుడు కూడా తను వెంటనే ఓకే అనలేదు. చాలా సమయం తీసుకున్న తర్వాత అప్పుడు ఓకే చెప్పింది. దీంతో ఇద్దరూ 2008 నుంచి డేటింగ్ చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత 2010 లో ధోనీ, సాక్షి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు జీవాలో అనే కూతురు కూడా ఉంది. ప్రస్తుతం ధోనీ వ్యవహారాలు అన్నీ సాక్షే దగ్గరుండి చూసుకుంటుంది. వీళ్ల లవ్ స్టోరీని చాలా ఇంటర్వ్యూలలో స్వయంగా ధోనీ, సాక్షి వెల్లడించారు. సోషల్ మీడియాలోనూ ధోనీ, సాక్షి, తన కూతురు జీవా సందడి చేస్తుంటారు.