Jagananna Vasathi Deevena : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. నవరత్నాలు కానీ.. జగనన్న తోడు, ఆసరా పెన్షన్లు, జగనన్న చేదోడు, వైఎస్సార్ చేయూత లాంటి ఎన్నో పథకాలను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే.. పేద విద్యార్థులకు తోడుగా ఉండేందుకు, వాళ్లకు ఉన్నత విద్య కోసం సహకరించేందుకు జగనన్న వసతి దీవెన అనే పథకాన్ని సీఎం జగన్ ఇటీవల ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన పేద విద్యార్థినీ విద్యార్థులకు చదువు ఖర్చులను ప్రభుత్వమే భరించనుంది. నిజానికి ఇలాంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. ఏపీలోనే తొలిసారి ప్రారంభించారు. టెన్త్ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్ లాంటి టెక్నికల్ కోర్సులు చదివే విద్యార్థులకు, డిగ్రీ చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.20 వేల వరకు వసతి, భోజనం ఖర్చులు, రవాణా ఖర్చులతో కలిపి డైరెక్ట్ గా వాళ్ల తల్లుల బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తారు.
పాలిటెక్నిక్ చదివే విద్యార్థులు కావచ్చు.. ఐటీఐ, డిగ్రీ.. ఇలా పై చదువులు చదివే విద్యార్థులు.. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు యూనివర్సిటీలు, బోర్డుల్లో చదివేవారు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. డే స్కాలర్, కాలేజీ అటాచ్ హాస్టళ్లు, డిపార్ట్ మెంట్ అటాచ్ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. అయితే.. డిస్టాన్స్ లో చదివే విద్యార్థులు, కరెస్పాండెన్స్ లో చదివే విద్యార్థులు ఈ పథకం కింద అనర్హులు అవుతారు. అలాగే మేనేజ్ మెంట్ కోటాలో చదివే విద్యార్థులు, స్పాట్ కోటాలో చదివే వారు కూడా అనర్హులు అవుతారు.
Jagananna Vasathi Deevena : కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల లోపు మాత్రమే ఉండాలి
అయితే.. కుటుంబం వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.2.50 లక్షల లోపు ఉన్న వాళ్లకు మాత్రమే అర్హత ఉంటుంది. విద్యార్థుల కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా.. పింఛన్ దారులు ఉన్నా కూడా అనర్హులు అవుతారు. ఎలాంటి ఫోర్ వీల్ వెహికల్స్ సొంతంగా కలిగి ఉండకూడదు. అలాగే.. పట్టణ ప్రాంతాల్లో ఉండేవారు అయితే… 1500 చదరపు అడుగుల లోపు ఇల్లు ఉన్నవారే అయి ఉండాలి. అలాగే.. ఇన్ కమ్ టాక్స్ కట్టేవారి కుటుంబంలోని విద్యార్థులు కూడా అనర్హులు అవుతారు.
ఈ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు.. నవశకం వెబ్ సైట్ లోకి వెళ్లి అక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దాని కోసం రెసిడెన్షియల్ ప్రూఫ్, కాలేజీ అడ్మిషన్ డాక్యుమెంట్స్, హాస్టల్ ఫీజు పేమెంట్ రశీదులు, ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, బీపీఎల్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద అర్హులైన వారికి.. ప్రతి సంవత్సరం రెండు విడతలుగా సాయాన్ని అందిస్తారు. అందులో ఐటీఐ విద్యార్థులకు సంవత్సరానికి రూ.10 వేల సాయం, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేల సాయం, డిగ్రీ, పీజీ చేసే విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తారు.