Black Eggs : తెల్ల కోడిగుడ్డు పేరు విన్నాం కానీ.. ఈ నల్ల కోడి గుడ్డు ఏంటి అంటారా? అసలు కోడి గుడ్డు ఎక్కడైనా నల్లగా ఉంటుందా అని కూడా మీరు అనొచ్చు. కానీ.. కోడిగుడ్డు నల్లగా కూడా ఉంటుంది. ఆ విషయం చాలామందికి తెలియదు. చివరకు ఈ బ్లాక్ ఎగ్ ను తినడానికి చాలా ప్రాంతాల నుంచి జనాలు భారీగా తరలివస్తున్నారంటే ఈ నల్ల కోడిగుడ్డుకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అవునా.. ఇంతకీ ఈ నల్లకోడి గుడ్డు ఎక్కడ దొరుకుతుంది. ఈ కోడిగుడ్డు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అని అడుగుతున్నారా? అయితే తెలుసుకుందాం పదండి.
ఈ గుడ్డు మన దగ్గర దొరకదు లేండి. ఆ గుడ్డు కావాలి అంటే జపాన్ వెళ్లాల్సిందే. జపాన్ వాళ్లే కాదు.. ఈ గుడ్డు తినడం కోసం ప్రపంచ దేశాల నుంచి జపాన్ కు వెళ్తారట. దీంతో జపాన్ లో టూరిజం కూడా డెవలప్ అయింది. ఈ గుడ్డును జపనీస్ బ్లాక్ ఎగ్ అంటారు. దాన్నే కురో తమాగో గుడ్డు అని కూడా పిలుస్తారు. ఈ నల్లగుడ్డును ఒక్కసారి తింటే చాలు.. కనీసం 7 నుంచి 8 ఏళ్ల పాటు ఆయుష్షు పెరుగుతుందని అక్కడి ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ గుడ్డును తినడానికి ప్రజలు క్యూ కడతారు. అయితే.. అక్కడ గుడ్లే నల్లగా ఉంటాయి కాబోలు అని అనుకునేరు. అక్కడి గుడ్లు నల్లగా ఉండవు. కానీ.. తెల్ల గుడ్లే.. వాటిని ఒక ప్లేస్ లో ఉడకబెడతారు. అప్పుడే అవి నల్లగా మారుతాయి.
Black Eggs : ఆ గుడ్లు నల్లగా మారడానికి కారణం అదే
జపాన్ లో హకోన్ అనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం కొన్ని వేల సంవత్సరాల కింద పేలిపోయింది. అగ్నిపర్వతం విస్పోటనం చెందింది. దాని వల్ల ఒవకుడాని అనే లోయ ఏర్పడింది. అక్కడ ఇప్పటికీ అగ్నిపర్వతం విస్పోటనం వల్ల వేడి నీటి కొలనులు ఏర్పడ్డాయి. ఆ వేడి నీటి కొలనులోనే ఈ గుడ్లను ఉడకబెడతారు. ఆ కొలనులో ఈ గుడ్లను వేసి ఉడకబెట్టగానే వాటిలోకి మనిషికి కావాల్సిన చాలా ప్రొటీన్స్ యాడ్ అవుతాయట. అవి తింటే మనిషి ఆయుష్షు పెరుగుతుందని జపాన్ ప్రజలు నమ్ముతారు.
అక్కడ సహజంగా ఏర్పడిన వేడి నీటిలో సల్ఫర్ ఉంటుంది. దాని వల్లనే గుడ్డు కూడా నల్లగా మారుతుంది. ఈ నీటిలో వాటిని 80 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టిన తర్వాత వాటిని 100 డిగ్రీల సెల్సియస్ వద్ద కాల్చుతారు. ఆ తర్వాత వాటిని అక్కడికి వచ్చిన టూరిస్టులకు అమ్ముతారు. మన కరెన్సీలో చూసుకుంటే ఒక్క గుడ్డు ఖరీదు కనీసం 100 రూపాయలు ఉంటుంది. డిమాండ్ ఎక్కువగా ఉంటే రేటు కూడా పెంచుతారు. దేశవిదేశాల నుంచి కూడా కేవలం నల్ల గుడ్డు తినడం కోసం ప్రజలు జపాన్ కు క్యూ కడుతున్నారంటే ఆ గుడ్డుకు ఎంత వాల్యూ ఉందో అర్థం చేసుకోవచ్చు.